తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తిరుమల పుణ్య క్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో లక్షలలో భక్తులు తరలి వచ్చి స్వామి వారికి పూజలు అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.

అంతే కాకుండా మరి కొంత మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కలు చెల్లించుకుంటూ ఉంటారు.

అలాంటి తిరుమల పుణ్యక్షేత్రానికి(Tirumala) దేశ వ్యాప్తంగా ఇంకా ఎంతో మంది భక్తులు రావడానికి వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు.అందుకోసం తిరుమల పుణ్య క్షేత్రంలో ఎప్పుడూ భక్తుల రద్దీ సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది.

ఈ రోజు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్(Vaikuntham Q Complex) లో 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇంకా చెప్పాలంటే సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) ముఖ్య అధికారులు తెలిపారు.ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం 7 గంటలకు సర్వదర్శనం టోకెన్లు లేకుండా క్యూ లైన్ లో ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య అధికారులు వెల్లడించారు.శనివారం రోజు తిరుమల శ్రీవారిని దాదాపు 80 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు తిరుమల దేవస్థానం అధికారులు వెల్లడించారు.ముఖ్యంగా చెప్పాలంటే 37 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.

శనివారం రోజు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం దాదాపు నాలుగు కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల దేవస్థానం అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు