పరమాత్మ స్వరూపాలు ఎన్ని అవి ఏవి?

మనలో జ్ఞానం సహజంగానే ఉంది.కానీ ఆ జ్ఞానాన్ని పైకి తెచ్చుకోవడానికి గురువులు తమ జ్ఞానాన్ని తోడుగా ఇచ్చి పైకి తెస్తారు.

ఇది వరకు మనల్ని అడ్డే పొరలని దాటి వచ్చే శక్తిని గురువులు ఉపదేశం ద్వారా ఇస్తారు.వారి ఉపదేశం లోనికి వెళ్ళి క్రమేపి కర్మ వాసనలు తొలగుతాయి.

How Many Forms Of Paramathma And What Are They , Devotional, Paramathma Rupalu,

"అధ్యాత్మ దీపమ్", దీపం కొత్తగా వస్తువులని తెచ్చి చూపదు.వస్తువు అక్కడే ఉంటుంది కానీ దీపాన్ని వెలిగించి పెట్టుకుని ఉన్నంత వరకు ఆవస్తువుని కనిపించేట్టు చేస్తుంది.

ఆత్మ స్వరూపాన్ని పరమాత్మ స్వరూప స్వభావాల్ని స్పష్ట పరిచే దీపాన్ని మహర్షి వెలిగించి పెట్టాడు.అలాగే తన భక్తులను కాపాడుకునేందు కోసం పరమాత్మ పలు రూపాలను ధరిస్తుంటాడు.

Advertisement

అందులో శ్రుతిని అనుసరించి ఐదు అవతారాలు ముఖ్యమైనవిగా తెలుస్తు న్నాయి.పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారం అనేవే ఆ ఐదు అవతారాలు.

ఈ ఐదింటిలో పర, వ్యూహ అవతారాలు సామాన్యులకు అందనివి.విభవ అవతారాలు కాలాంతరంలో వెలిసాయి.

అంతర్యామి దర్శనం యోగులకు మాత్రమే సాధ్యం.కాగా అర్చావతారం మాత్రమే మనందరికీ దర్శనమిస్తూ పూజలందుకుంటూ మనలను ధన్యులను చేస్తోంది.1.పరస్వరూపం : అనంత గరుడ విష్వక్సేనాది నిత్యసూరు లచే పరివేష్టితమై లక్ష్మీయుతమై ఉండే దివ్యమంగళ స్వరూపం.2.వ్యూహము: వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ తదితర నామాలతో గుర్తింపబడుతూ పాలకడలి మధ్యన శేషశాయిపై పవళించి ఈశాన మునీశ్వరులతో సేవించబడుతున్న స్వరూపం.3.బ్రహ్మేంద్రాది , దుష్టశిక్షణ, ధర్మ సంస్థాపనార్థం దేశకాల పరిస్థితులకు అనుగుణంగా వెలిసే అవతారాలు, రాముడు, కృష్ణుడు వంటివి.4.అంత ర్యామి : సర్వప్రాణుల హృదయాలలో ఉండే స్వరూపం.5.అర్చావతారం: మనకోసం ఇళ్ళలో, దేవాలయాలలో రథోత్సవాలలో ప్రతిష్ఠితమై, మనలను కరుణిస్తోన్న అమృత మయ మూర్తులు.

పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?
Advertisement

తాజా వార్తలు