అమెరికాలో కొత్త రకం వైరస్....ఒక్క రోజులోనే ఇన్ని చావులా..!!

అగ్ర రాజ్యం అమెరికా కరోనా మహమ్మారి కారణంగా అతలాకుతలం అయ్యింది.

ఆర్ధిక స్థితి పక్కన పెడితే రోజు రోజుకు మృతి చెందుతున్న వారి సంఖ్య చూస్తుంటే అమెరికన్స్ వెన్నులో వణుకు పుట్టుకొస్తోంది.

ఉద్యోగాల మాటేమో కానీ బ్రతికి ఉంటె చాలు అనుకుంటున్నారు.కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వ్యాక్సిన్ పై ఉన్న అపోహల కారణంగా వ్యాక్సిన్ ను వేయించుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

దాంతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఇదిలాఉంటే కరోనా దెబ్బకే ప్రజలు అల్లాడి పోతుంటే కొత్త రకం వైరస్ ఎంట్రీ ఇచ్చింది.

బ్రిటన్, స్పెయిన్, దక్షిణ ఆఫ్రికాలలో కొత్త వైరస్ విజ్రుంభించినట్టుగానే తాజాగా అమెరికాలో కూడా కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది .ఈ విషయాన్ని ఏకంగా వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించడంతో అమెరికన్స్ లో మరింత ఆందోళన రేగింది.ఇప్పటికి ఈ కొత్త వైరస్ ధాటికి 3700 మంది చనిపోవడంతో హై టెన్షన్ వాతావరం నెలకొంది.

Advertisement

ఈ కొత్త వైరస్ కరోనా మహమ్మారి కంటే కూడా 50శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని అంటున్నారు పరిశోధకులు.ఇదిలాఉంటే

గడించిన 24 గంటల్లో అమెరికాలో మొత్తం 3 లక్షల కేసులు నమోదయినట్టుగా తెలుస్తోంది.ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా ఈ మహమ్మారి విస్తరించి ఉంటుందని అంచనాలు వేస్తున్నారు.కాగా గతంలోనే అమెరిక ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు అంటోని పౌచీ కొత్త రకం వైరస్ గురించి అమెరికా ప్రజలను అప్రమత్తం చేశారు.

క్రిస్మస్ ,న్యూ ఇయర్ పురస్కరించుకుని ఎవరూ రోడ్లపైకి రావద్దని దూర ప్రయాణాలు చేయద్దని చెప్పినా అమెరికన్స్ సరైన జాగ్రత్తలు కూడా తీసుకోకుండా తిరగడంతోనే ఇంతమందికి వ్యాప్తి చెందిందని తెలుస్తోంది.ప్రస్తుతం కొత్త రకం వైరస్ పై ఆయా దేశాలలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు