తుపాకీ నుంచి దూసుకు వచ్చే బుల్లెట్ ఎంత దూరం వెళుతుందంటే..

తుపాకీ నుండి బుల్లెట్ బయటకు వచ్చినప్పుడు, అది విపరీతమైన శక్తిని, వేగాన్ని కలిగి ఉంటుంది.అది ఎవరికైనా తగిలితే అతను చనిపోవచ్చు లేదా తీవ్రంగా గాయపడవచ్చు.

 How Long A Bullet Can Travel, Gun,bullet,bullet Facts, Snippet Bullet, Bullet Ra-TeluguStop.com

ప్రతి పిస్టల్, రివాల్వర్ ఒక్కో రేంజ్‌లో ఉంటాయి.వేర్వేరు బుల్లెట్‌లు వాటి బరువు, మందంతో పాటు పరిమాణం, ఆకారాన్ని బట్టి విభిన్న రీతులలో ఉంటాయి.

అయితే బుల్లెట్ ఎంత దూరం వెళుతుందనేది కొన్ని అంశాలపై ఆధారపడివుంటుంది.నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా తెలిపిన వివరాల ప్రకారం 09 mm హ్యాండ్‌గన్ అత్యంత ప్రమాదకారిగా గుర్తింపుపొందింది.దాని నుండి వెలువడిన బుల్లెట్ 2130 గజాల వరకు అంటే 1.2 మైళ్ల దూరం వరకూ వెళ్లగలదు.ఇది ఉపయోగించే తుపాకీ బారెల్ పొడవుపై కూడా ఆధారపడి ఉంటుంది.

Telugu Bullet, Bullet Range, Snippet Bullet, Telugu-General-Telugu

కొన్ని సంవత్సరాల క్రితం కెనడియన్ స్పెషల్ ఫోర్సెస్ స్నిపర్ సాయంతో ఇరాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిపై కాల్పులు జరిపాయి.వారు 2.2 మైళ్ల దూరం నుంచి తుపాకీతో చంపారు.వారి స్నిపర్ పరిధిని మించి దూసుకు వెళ్లినందున ఈ అంశం చర్చకు వచ్చింది.గణాంకాల ప్రకారం 22 క్యాలిబర్ బుల్లెట్ ఒకటిన్నర మైళ్ల వరకు వెళ్లగలదు.సెంటర్‌ఫైర్ బుల్లెట్ కొన్ని మైళ్ల వరకు దూసుకు వెళుతుంది.చిన్న షాట్‌లు అంటే రివాల్వర్ లేదా పిస్టల్ నుండి కాల్చే బుల్లెట్ 200 నుంచి 300 గజాల దూరం వరకు వెళుతుంది.

అయితే ఇందులో లాంగ్ రేంజ్ గన్‌లను 600 గజాల వరకు వెళతాయి.మొత్తంగా చూసుకుంటే సగటు తుపాకీ షాట్ వేగం సెకనుకు 2500 అడుగులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube