ఒకప్పుడు జగపతి బాబు సినిమాలని ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఇష్టపడే వారు.ఆయన చేసే సినిమాలు కూడా మంచి క్లాస్ గా ఉండేవి లవ్ స్టోరీస్ చేస్తూనే అసలు ఎక్కడ కూడా వల్గారిటీ లేకుండా మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేసేవారు ఆయన చేసిన సినిమాల్లో శుభలగ్నం,మావిచిగురు,శుభాకాంక్షలు,పెళ్లి కానుక లాంటి సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి.
ఇవన్నీ సినిమాలు చూసిన జనాలు శోభన్ బాబు
తరువాత ఫ్యామిలీ సినిమాలు చేసే ఏకైక హీరో జగపతి బాబు మాత్రమే అనే ఒక ముద్రని సంపాదించుకున్నాడు…అలా అప్పుడు వరుస హిట్స్ కొట్టి మంచి హీరోగా గుర్తింపు పొందాడు.ఆ తర్వాత ఆయనకి వరుసగా ప్లాప్స్ వచ్చి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి దాంతో ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నప్పుడు జగపతి బాబు వాళ్ల ఇంటి ముందు నుంచి పోయే ఒక ఆటో వాడు సినిమాల్లో

విలన్ గా చేయచ్చు కదా అని అన్నాడట దాంతో ఇంట్లోకి వచ్చి ఆలోచనలో ఉన్న జగపతిబాబు కి ఆ ఆటోవాడు చెప్పింది నిజమే కదా అని అనుకున్నాడట ఇది జరిగిన కొద్దిరోజులకే బోయపాటి బాలయ్య కాంబోలో వచ్చిన లెజెండ్ సినిమాలో విలన్ గా చేసారు…ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చూసిన సినీ ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీ కి

మరో కొత్త విలన్ దొరికాడు అని అనుకున్నారు…ఇక అప్పటి నుండి అటు విలన్ గా ఇటు హీరో ఫాదర్ గా అన్ని రకాల పాత్రలు చేస్తూ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందాడు తెలుగు లోనే కాకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ టాప్ రెమ్యున్ రేషన్ అందుకుంటున్నాడు…
.







