ష‌ర్మిల తెలంగాణ కోడ‌లు ఎలా అయ్యింది ?

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్.

ష‌ర్మిల తెలంగాణ‌లో కొత్త పార్టీ ఏర్పాటుపై చేస్తోన్న క‌స‌ర‌త్తులు రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర ప్ర‌కంప‌న‌లు రేపుతోన్న సంగ‌తి తెలిసిందే.

బెంగ‌ళూరులోనే ఉంటోన్న ఆమె హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్ కేంద్రంగా కొత్త రాజ‌కీయ పార్టీపై క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.

దీంతో తెలంగాణ నేత‌లు ఆంధ్రా అమ్మాయికి తెలంగాణ రాజ‌కీయాల‌తో సంబంధం ఏంట‌ని ప్ర‌శ్నిస్తుండ‌డంతో పాటు ఆమె ఆంధ్రాలో రాజ‌కీయాలు చేసుకోవాల‌ని సెటైర్లు వేస్తున్నారు.తెలంగాణ రాజ‌కీయ నేత‌లు మాట్లాడుతూ ఆమె తెలంగాణ‌కు వ‌స్తే.

ఆమె వెంట జ‌గ‌న్ వ‌స్తార‌ని.ఆ త‌ర్వాత చంద్ర‌బాబు వ‌స్తార‌ని.మ‌ళ్లీ స‌మైక్య పాల‌న ప్రారంభ‌మ‌వుతుంద‌న్న విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

Advertisement
How Did Sharmila Become Telangana Daughter In Law, Telangana,ap Chief Minister,j

ఇక ఆమె నిజంగానే తెలంగాణ కోడలు ఎలా ? అయ్యింద్న దానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌ల నడుస్తున్నాయి.ఆమె పుట్టింది.

పెరిగింది అంతా హైద‌రాబాద్‌లోనే.తండ్రి వైఎస్ స్వ‌స్థ‌లం క‌డ‌ప‌.

How Did Sharmila Become Telangana Daughter In Law, Telangana,ap Chief Minister,j

ఇక ఆమె భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ విష‌యానికి వ‌స్తే అనిల్ తండ్రి మురుసుపల్లి రమణరావు.తల్లి అరుణ.తండ్రి ఖమ్మం జిల్లా చెందిన వారు కాగా.అరుణది ఆంధ్రా ప్రాంతం.

దీంతో ఆంధ్రాకు చెందిన అనిల్ త‌ల్లి అరుణ తెలంగాణ‌లోని ఖ‌మ్మం జిల్లా కోడ‌లుగా వ‌చ్చింది.అలా వారి త‌న‌యుడు అనిల్ తెలంగాణ‌కు చెందిన బిడ్డ అయ్యాడు.

ఇప్పుడు ష‌ర్మిల కూడా తెలంగాణ కోడ‌లు కావ‌డంతో ఆమె పుట్టిల్లు ఆంధ్రా అయినా.ఆమె మెట్టినిల్లు తెలంగాణ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు