రాజమౌళి( Rajamouli ) లాంటి దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.పాన్ ఇండియాలో ఆయనే ప్రస్తుతం నెంబర్ వన్ డైరెక్టర్ గా కూడా కొనసాగుతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి.ఇక అందుకే ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ లో మహేష్ బాబుతో( Mahesh Babu ) ఒక సినిమా చేయబోతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ప్రభాస్( Prabhas ) తో మొదట ఛత్రపతి అనే సినిమా చేశాడు.అయితే రాజమౌళి ముందుగా ప్రభాస్ తో సింహాద్రి సినిమా ( Simhadri movie )చేయాల్సింది.కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా సెట్ అవలేదు.ఇక దాంతో ఎలాగైనా ఛత్రపతి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన్ని హీరోగా పెట్టి ఛత్రపతి సినిమా( Chhatrapati movie ) అయితే చేశాడు.
అయితే చూసేవాళ్ళు వీళ్ళిద్దరికి ఈ సినిమా చేస్తున్న సమయంలోనే పరిచయం అయింది అని అందరూ అనుకుంటారు.కానీ రాజమౌళి రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికీ మంచి పరిచయం ఉందట.
ఇక ప్రభాస్ రాజమౌళి ఎప్పుడు తరచుగా కలుస్తూ ఉండేవారట.ఇక ఆ లోపే ప్రభాస్ హీరో అవడం, రాజమౌళి డైరెక్టర్ అవడంతో వీళ్లిద్దరూ కలిపి ఛత్రపతి సినిమా చేశారు.
ఇలా మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో ఛత్రపతి, బాహుబలి, బాహుబలి 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ రావడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక మొత్తానికైతే రాజమౌళి అనుకున్నట్టుగానే ఇప్పుడు పాన్ వరల్డ్ లో సినిమా చేసి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయి లో విస్తరింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇది ఇలా ఉంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగాలని కోరుకుందాం…
.