రంగస్థలం సినిమాలో చిట్టిబాబు కి ఆ విషయం ఎలా తెలిసిందంటే..?

సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా వచ్చిన సినిమా రంగస్థలం(Rangasthalam) ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నాన్ బాహుబలి రికార్డులని తిరగరాసింది.

ఈ సినిమాతో రామ్ చరణ్ పూర్తి స్థాయి లో నటించి మెప్పించాడు అనే చెప్పాలి.

చెవిటివాడి పాత్రలో చాలా అద్భుతంగా నటించడమే కాకుండా దాంట్లో జీవించాడనే చెప్పాలి.ఈ సినిమా విజయం లో డైరెక్టర్ గా సుకుమార్ ఎంత పెద్ద భాధ్యత వహించారో హీరోగా రామ్ చరణ్ కూడా అంత పెద్ద బాధ్యతే వహించాడు.

ఇక ఈ సినిమాలోకి వెళ్తే దీంట్లో జగపతి బాబు పోషించిన ప్రెసిడెంట్ పాత్రకి చాలా మంచి పేరు వచ్చింది.జగపతి బాబు కి ఇదొక డిఫరెంట్ పాత్ర అనే చెప్పాలి.అయితే ఈ సినిమాలో అందరూ ఆయన్ని ప్రెసిడెంట్ గారు అనే పిలుస్తూ ఉంటారు అంతే తప్ప ఆయన పేరు ఏంటి అనేది ఎవరికీ తెలీదు

అయితే చిట్టి బాబ (రామ్ చరణ్),కుమార్ బాబు(ఆది)(Aadhi)ఇద్దరు కలిసి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మేము మీకు వ్యతిరేకం గా నామినేషన్ వేసాము అని చెప్పి తిరిగి వస్తుంటే రామ్ చరణ్ వెనక్కి తిరిగి వెళ్లి వస్తాం ఫణీంద్ర భూపతి గారు అంటారు అయితే ఊరిలో ఉన్న ఎవ్వరికీ తెలియని ఆయన పేరు రామ్ చరణ్ కి ఎలా తెలిసింది అని, ఆ సినిమా చూసిన వాళ్లలో చాలా మంది కి డౌట్ ఉంది.కానీ ఆ పేరు రామ్ చరణ్ ఎలా తెలిసిందంటే వీళ్ళు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్ లో ఇంతకు ముందే నామినేషన్ వేసిన ప్రెసిడెంట్ గారి పేరు చూస్తారు.

Advertisement

కాబట్టి చిట్టి బాబుకు ఆయన పేరు తెలుస్తుంది.చిట్టి బాబు ఆయన్ని పేరు పెట్టి పిలిచే సీన్ కి సినిమా చూస్తున్నప్పుడు నిజంగా గుస్ బంబ్స్ వచ్చాయనే చెప్పాలి.అలాగే ఈ సినిమా మొత్తాన్ని డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడనే చెప్పాలి.

అటు రామ్ చరణ్(Ram charan) కెరియర్ లో అయిన, ఇటు సుకుమార్ కెరియర్ లో అయిన ది బెస్ట్ సినిమాగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Advertisement

తాజా వార్తలు