అనంతపురం జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టిస్తుంది.చెర్లోపల్లిలో కూతురిని రోకలిబండతో కొట్టి చంపాడు ఓ తండ్రి.
కూతురు స్వాతి వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించింది.ఈ వ్యవహారంపై తండ్రి గురప్పకు, స్వాతికి అనేక సార్లు గొడవ జరిగింది.
నిన్న కూడా ఇదే విషయంపై వివాదం చెలరేగింది.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గురప్ప కూతురిని కొట్టి చంపాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.







