ర‌ఫ్ స్కిన్‌తో బాధ‌ప‌డుతున్నారా? డోంట్ వ‌ర్రీ.. ఈ హోమ్ మేడ్ సీర‌మ్ మీకోస‌మే!

ర‌ఫ్ స్కిన్‌.పురుషులే కాదు చాలా మంది స్త్రీలు కూడా ఈ స‌మ‌స్య‌ను ఫేస్ చేస్తుంటారు.

రెగ్యుల‌ర్‌గా స్క్ర‌బ్బింగ్ ప్యాకుల‌ను వాడ‌టం, కఠినమైన సబ్బులు మరియు డిటర్జెంట్లను యూస్ చేయ‌డం, వ‌య‌సు పైబ‌డ‌టం, వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, డీహైడ్రేష‌న్‌, కెమిక‌ల్స్ అధికంగా ఉండే చ‌ర్మ ఉత్ప‌త్తుల‌ను వినియోగించ‌డం, చ‌ర్మంలో తేమ త‌గ్గిపోవ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల కోమ‌లంగా ఉండాల్సిన చ‌ర్మం కఠినంగా మారిపోతుంటుంది.దాంతో సౌంద‌ర్యం తీవ్రంగా దెబ్బ‌తింటుంది.

ఈ క్ర‌మంలోనే ర‌ఫ్ స్కిన్‌ను వ‌దిలించుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.వారు, వీరు చెప్పిన చిట్కాల‌ను పాటిస్తుంటారు.

ఖ‌రీదైన మాయిశ్చ‌రైజ‌ర్స్ వాడుతుంటారు.అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో అర్థంగాక లోలోన మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.

Advertisement
Homemade Serum For Rough Skin , Homemade Serum, Rough Skin, Serum, Smooth Skin,

మీరు ర‌ఫ్ స్కిన్‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే డోంట్ వ‌ర్రీ.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే హోమ్ మేడ్ సీర‌మ్‌ను వాడితే మీ క‌ఠిన‌మైన చ‌ర్మం మృదువ‌గా మార‌డం ఖాయం.

ఇక ఇంత‌కీ ఆ న్యాచుర‌ల్ సీర‌మ్‌ను ఎలా త‌యారు చేసుకోవాలంటే.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాట‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని బాగా క‌లిపి ఓ అర‌గంట పాటు ప‌క్క‌న పెట్టుకోవాలి.

ఆ త‌ర్వాత మ‌రో బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల కుకుంబ‌ర్ జెల్‌, పావు స్పూన్ ప‌సుపు, వ‌న్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

Homemade Serum For Rough Skin , Homemade Serum, Rough Skin, Serum, Smooth Skin,

చివ‌రిగా అందులో మొద‌ట క‌లిపి పెట్టుకున్న రోజ్ వాట‌ర్‌-యాపిల్ సౌడ‌ర్ వెనిగ‌ర్ వేసి నాలుగైదు నిమిషాల పాటు క‌లిపితే సీర‌మ్ సిద్ధం అవుతుంది.ఈ సీర‌మ్‌ను ఒక బాటిల్‌లో నింపుకుని. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే రెండు వారాల పాటు వాడుకోవ‌చ్చు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

నైట్ నిద్రించే ముందు ముఖానికి ఈ సీర‌మ్‌ను అప్లై చేసుకుని మ‌సాజ్ చేసుకోవాలి.రోజూ ఈ సీర‌మ్‌ను రాసుకుంటే ర‌ఫ్ స్కిన్ స్మూత్ అండ్ షైనీగా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు