సైన‌స్‌తో ఇబ్బందా? అయితే ఈ టిప్స్ ట్రై చేయాల్సిందే!

సైన‌స్ ఇన్ఫెక్షన్ప్ర‌పంచ‌వ్యాప్తంగా దీని బాధితులు కోట్ల సంఖ్య‌లో ఉన్నారు.సైనస్ భాగంలో ఇన్ఫెక్షన్ సోకి వాచి పోతుంది.

దీనినే సైనసైటిస్ అంటారు.వాతావ‌ర‌ణం కాస్త చ‌ల్ల‌గా మారిందంటే చాలు శ్వాస తీసుకోలేక‌పోవ‌డం, తలనొప్పి, ముక్కు కారడం, జ‌లుబు, ద‌గ్గు, ముక్క దిబ్బ‌డ‌, తుమ్ములు, ముఖంలో వాపు, సైనస్ భాగంలో తీవ్ర‌మైన నొప్పి, గొంతు గరగర, ఆల‌స‌ట‌, చికాకు ఇలా అనేక‌ ల‌క్ష‌ణాల‌తో సైన‌స్ బాధితులు విసిగి పోతుంటారు.

అలాంట‌ప్పుడు కొన్ని కొన్ని న్యాచుర‌ల్‌ టిప్స్ పాటిస్తే సులువుగా సైన‌స్ ల‌క్షణాల నుంచి బ‌య‌ట ప‌డొచ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

అల్లం సైన‌స్ ఇన్ఫెక్ష‌న్ ల‌క్ష‌ణాల‌ను నివారించ‌డంలో అద్భుతంగా సహాయ‌ప‌డుతుంది.నీటిలో అల్లాన్ని బాగా మ‌రిగించి వ‌డ‌బోసి అందులో తేనె క‌లిపి సేవించాలి.

Advertisement
Home Remedies To Get Rid Of Sinus Infection Symptoms! Home Remedies, Sinus Infec

ఇలా రోజుకు ఒక‌టి, రెండు క‌ప్పులు తీసుకుంటే నాజల్ ఫీ అవుతుంది.మ‌రియు జ‌లుబు, ద‌గ్గు, త‌ల‌నొప్పి, ముక్క దిబ్బ‌డ వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

అలాగే నీటిలో గుప్పెడు పుదీనా ఆకులు వేసి బాగా హిట్ చేయాలి.ఇప్పుడు ఈ నీటితో ఆవిరి ప‌ట్టుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా ఒక సారి చేస్తే.సైన‌స్ ఇన్ఫెక్ష‌న్‌కు కార‌ణ‌మ‌య్యే వైర‌స్‌, బ్యాక్టీరియా నాశ‌నం అవుతాయి.

సైన‌స్‌తో ఇబ్బంది ప‌డే వారు డైట్‌లో ఆరెంజ్, లెమన్, స్ట్రాబెరీ, బొప్పాయి, ద్రాక్ష ఇలా విట‌మిన్ సి అధికంగా ఉండే పండ్లను చేర్చుకోవాలి.త‌ద్వారా ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఫ‌లితంగా సైనస్ కు సంబంధించిన లక్షణాలన్నీ దూరం అవుతాయి.

Home Remedies To Get Rid Of Sinus Infection Symptoms Home Remedies, Sinus Infec
Advertisement

సైనస్‌ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియా అంతం చేయ‌డంలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌ లక్షణాలు పుష్కలంగా వెల్లుల్లి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.అందువ‌ల్ల‌, ఏదో ఒక రూపంలో ప్ర‌తి రోజు తీసుకోవాలి.ఇక ఈ టిప్స్‌తో పాటుగా వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి.

లేదంటే శ‌రీరం డీహైడ్రేట్ అయ్యి సైన‌స్ ఇన్ఫెక్ష‌న్ మ‌రింత తీవ్రంగా మారుతుంది.అలాగే మ‌ద్య‌పానం, ధూమ‌పానానికి దూరంగా ఉండాలి.

రెగ్యుల‌ర్‌గా వ్యాయామాలు చేయాలి.

తాజా వార్తలు