ఓపెన్ పోర్స్ స‌మ‌స్య‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌నుకుంటే ఇలా చేయండి!

ఓపెన్ పోర్స్‌. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని వేధించే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇదీ ఒక‌టి.

కాలుష్యం, ఎండ‌ల్లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే మేక‌ప్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం, హార్మోన్ ఛేంజ‌స్‌.ఇలా ర‌క‌ర‌కాలా కార‌ణాల వ‌ల్ల ఓపెన్ పోర్స్ స‌మ‌స్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది.

అయితే కార‌ణం ఏదైనా ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్‌ను పాటిస్తే గ‌నుక‌.ఓపెన్ పోర్స్ స‌మ‌స్య‌కు శాశ్వ‌తంగా స్వ‌స్తి ప‌ల‌కొచ్చు.

మ‌రి లేటెందుకు ఆ టిప్స్ ఏంటో చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ఎగ్ వైట్‌, ఒక స్పూన్ ముల్తానీ మ‌ట్టి, ఒక స్పూన్ రోజ్ వాట‌ర్ వేసుకుని మిక్స్ చేసి పెట్టుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఫేస్‌ను గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకుని.ఆపై త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి.

ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి.అనంత‌రం మ‌ళ్లీ గోరు వెచ్చ‌ని నీటితోనే ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేస్తే ఓపెన్ పోర్స్ స‌మ‌స్య త‌గ్గ‌డ‌మే కాదు.స్కిన్ వైట్‌గా, బ్రైట్‌గా కూడా మారుతుంది.

అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ తోనూ ఒపెన్ పోర్స్‌ను నివారించుకోవ‌చ్చు.ఒక క‌ప్పు నీటితో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌ను యాడ్ చేసి మిక్స్ చేయండి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని దూది సాయంతో ముఖానికి పూయండి.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

ఇలా రోజూ చేస్తే ఓపెన్ పోర్స్ స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గి పోతుంది.

Advertisement

ఇక బొప్పాయి పండు ముక్క‌లు, అరటి పండు ముక్క‌లు, కివీ పండు ముక్క‌లు స‌మానంగా తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేయండి.ఆ త‌ర్వాత అందులో కొద్దిగా ప‌చ్చి పాలును యాడ్ చేసి మిక్స్ చేయండి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి స్మూత్‌గా మ‌సాజ్ చేసుకోవాలి.

ఆపై గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేసినా కూడా ఓపెన్ పోర్స్ స‌మ‌స్య నుంచి విముక్తి ల‌భిస్తుంది.

తాజా వార్తలు