పాదాలు త‌ర‌చూ పొడిబారుతున్నాయా.. ఈ టిప్స్‌తో చెక్ పెట్టేయండి!

సాధార‌ణంగా కొంద‌రి పాదాలు త‌ర‌చూ పొడిబారితు ర‌ఫ్‌గా మారిపోతుంటాయి.ముఖ్యంగా ప్ర‌స్తుత‌ వింట‌ర్ సీజ‌న్‌లో ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా ఉంటుంది.

పాదాలు పొడిబారి డ్రైగా మారితే.అంద‌హీనంగా క‌నిపిస్తాయి.

దీంతో పాదాల‌ను మృదువుగా, అందంగా మార్చుకునేందుకు పార్ల‌ర్స్ చుట్టు తిరుగుతూ.వేల‌కు వేలు ఖ‌ర్చు పెడ‌తారు.

కానీ, ఇంట్లో కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించినా పొడిబారిన పాదాల‌ను అందంగా, స్మూత్‌గా మార్చుకోవ‌చ్చు మ‌రి ఆ టిప్స్ ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.పాదాల‌ను మృదువుగా మార్చ‌డంలో అర‌టి పండ్లు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

Advertisement

అంద‌వ‌ల్ల‌, బాగా పండిన అర‌టి పండ్ల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో కొద్దిగా తేనె మిక్స్ చేసి.

పాదాల‌కు అప్లై చేయాలి.అర‌గంట పాటు ఆర‌నిచ్చి.

అనంర‌తం గోరు వెచ్చ‌ని నీటితో పాదాల‌ను శుభ్రం చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక‌సారి చేయ‌డం వ‌ల్ల పాదాలు మృదువుగా మార‌తాయి.

రెండొవ‌ది.కొన్ని వేపాకులు, తుల‌సి ఆకులు స‌మానంగా తీసుకుని మొత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఆ పేస్ట్‌లో కొద్దిగా నిమ్మ ర‌సం వేసి బాగా మిక్స్ చేసుకుని.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

పాదాల‌కు అప్లై చేయాలి.ఒక గంట పాటు పాదాల‌ను ఆర‌నిచ్చి.

Advertisement

ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో పాదాల‌కు క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు సార్లు చేస్తే.

డ్రైగా మారిన పాదాలు స్మూత్‌గా మ‌రియు కాంతివంతంగా మార‌తాయి.

ఇక మూడొవ‌ది.ఒక బౌల్‌లో శెన‌గ‌పిండి, బియ్యంపిండి మ‌రియు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు అప్లై చేసి.

మెల్ల‌గా రుద్దుకోవాలి.అర గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో పాదాల‌ను వాష్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల పాదాల‌పై మృత‌క‌ణాలు, ముడ‌తలు పోయి.మృదువుగా, అందంగా మార‌తాయి.

తాజా వార్తలు