మ‌డ‌మ‌ నొప్పి వేధిస్తుందా..?అయితే ఇవి ట్రై చేయండి!

మ‌డ‌మ‌ నొప్పి చాలా మంది కామ‌న్‌గా ఫేస్ చేసే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.ముఖ్యంగా ఆడ‌వారిలో ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది.

మ‌డ‌మ‌లు నొప్పి పుట్ట‌డం వ‌ల్ల నేల మీద కాలు పెట్టాలంటే చాలా మందికి నరకం కనిపిస్తుంటుంది.ఈ క్ర‌మంలోనే మ‌డ‌మ నొప్పిని ఎలా నివారించుకోవాలో తెలియ‌క తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.

పెయిన్ కిల్ల‌ర్స్ కూడా వాడుతుంటారు.కానీ, ఇంట్లోనే కొన్ని కొన్ని న్యాచుర‌ల్ టిప్స్ పాటిస్తే సుల‌భంగా మ‌డ‌మ నొప్పిని నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.మ‌డ‌మ నొప్పిని త‌గ్గించ‌డంలో ఆముదం గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement
Home Remedies For Get Rid Of Heel Pain! Home Remedies, Heel Pain, Latest News, H

ఆముదాన్ని లైట్‌గా వేడి చేసి దాన్ని మ‌డ‌మ‌ల‌కు అప్లై చేసి కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటిలో పాదాల‌కు కాసేపు ఉంచితే నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

బేకింగ్ సోడా కూడా మ‌డ‌మ నొప్పిని త‌గ్గించ‌గ‌ల‌దు.ఒక బౌల్‌లో కొద్దిగా వాట‌ర్ తీసుకుని అందులో బేకింగ్ సోడా క‌లిపి మ‌డ‌ప‌ల‌పై పూయాలి.

అర‌ గంట అనంత‌రం నీటితో పాదాల‌కు క్లీన్ చేసుకుంటే నొప్పి త‌గ్గు ముఖం ప‌డుతుంది.

Home Remedies For Get Rid Of Heel Pain Home Remedies, Heel Pain, Latest News, H

యాపిల్ సైడర్ వెనిగర్ కూడా మ‌డ‌మ నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌గ‌ల‌దు.బ‌కెట్‌లో గోరు వెచ్చ‌ని నీటి తీసుకుని అందులో రెండు, మూడు స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి క‌లిపి అందులో పాదాల‌కు ఉంచాలి.ఇలా కాసేపు ఉంచితే మ‌డ‌మ నొప్పి మ‌టుమాయం అవుతుంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

,/br>ఇక ఈ టిప్స్‌తో పాటు నొప్పి త్వ‌ర‌గా త‌గ్గాలంటే విశ్రాంతి కూడా ఎంతో అవ‌స‌రం.అలాగే నొప్పి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బరువులు ఎత్త‌డం, పరిగెత్త‌డం, మెట్లు ఎక్కడం వంటివి చేయకూడదు.

Advertisement

మ‌రియు డైట్‌లో తాజా కూర‌గాయ‌లు, ఆకు కూర‌లు, పండ్లు, ప‌ప్పు ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి.వంటకాలలో కేవలం నువ్వుల నూనెనే వాడండి.

తాజా వార్తలు