మృదువైన చేతులు సొంతం కావాలంటే....

సాధారణంగా చాలా మంది ముఖం మీద పెట్టిన శ్రద్ధను చేతుల మీద పెట్టరు.అందువలన చేతులు నల్లగా మరియు ముడుతలతో అసహ్యంగా కనపడుతుంది.

ఈ సమస్య నుండి బయట పడటానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.వారానికి ఒక్కసారైనా చేతులకు కొద్దిగా ఆలివ్ ఆయిల్ ని రాసి మసాజ్ చేయాలి.

ఈ విధంగా చేయుట వలన చేతుల్లో రక్తప్రసరణ బాగా జరిగి చర్మం బిగుతుగా మారుతుంది.చేతులపై మృత కణాలు పేరుకుంటే ముడతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అందువల్ల పంచదారలో ఆలివ్ నూనె కలిపి చేతులకు రాసుకొని ఆరాక కడిగేయాలి.ఈ విధంగా వారానికి ఒకసారి తప్పనిసరిగా చేయాలి.

Advertisement

చేతులతో పాటు గోళ్ళ మీద కూడా శ్రద్ద పెట్టాలి.గోళ్ళు తాజాగా కనపడాలంటే నిమ్మచెక్కతో గోళ్లను రుద్దాలి.

చేతులపై మచ్చలు ఉంటే కనుక.బంగాళాదుంప స్లైస్ తో రుద్దాలి.

బంగాళాదుంపలో ఉన్న బ్లీచింగ్ గుణాలు మచ్చలను తగ్గించటంలో సహాయపడతాయి.చేతుల వెనక భాగంలో ముడతలు ఉంటే.

వారానికి ఒకసారి ఆముదంతో మసాజ్ చేసుకోవాలి.ఇలా కొన్ని వారాల పాటు చేస్తే ముడతలు తగ్గిపోతాయి.

మొబైల్ ఫోన్ రాత్రి పక్కన పెట్టుకొని నిద్రపోతే ప్రమాదమా.. ముఖ్యంగా పురుషులకు..
Advertisement

తాజా వార్తలు