ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఎన్నికల్లో గెలుపు కోసం హోం మంత్రి ప్రలోభాలు పర్వానికి తెరలేపారు.అంగన్వాడి, ఆశా కార్యకర్తలకు ఆత్మీయ సమావేశం పేరుతో తాయిలాలు అందించి ఓటర్లను ప్రలోభ పెట్టి తనకే ఓట్లు వేయించాలని ఒత్తిడి చేశారు.
అంగన్వాడీలకు, ఆశా కార్యకర్తలకు హాట్ బాక్సులు, ప్లాస్కోల పంపిణీ చేసి వారిని ప్రలోభాలకు గురి చేశారు.ద్వారకాతిరుమల శేషాచల కొండ సమీపంలో నాన్ వెజ్‌తో విందు భోజనాలు ఏర్పాటు చేసి స్వయంగా హోంమంత్రి ఆ భోజనాలను వడ్డించారు.

దేవస్థానం సమీపంలో నాన్ వెజ్ భోజనాలు పెట్టడంపై మంత్రి వ్యవహార శైలిపై భక్తుల మండిపడుతున్నారు.ఓటమి భయంతోనే హోం మంత్రి ప్రలోభాలకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.బహిరంగంగానే అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలకు గిఫ్ట్లిచ్చిన సంబంధిత ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదనీ విమర్శలు వెలివెత్తుతున్నాయి.







