గరుడ పురాణాన్ని ఇంట్లో చదివితే తప్పా..?

వ్యాస మహర్షి రాసిన 18 పురాణాలలో గరుడ పురాణం ఒకటి. నరకం గురించి పాపాత్ముల శిక్షల గురించి ఇందులో క్లుప్తంగా వివరించారు వ్యాస మహర్షి.

 ఈ గరుడ పురణంలో మత్తం 18 వేల శ్లోకాలున్నాయి. గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు శ్రీ మహా విష్ణువు చెప్పిన సమాధానాలు ఈ గరుడ పురాణంలో ఉన్నాయి.

Home It Is Right Or Wrong Place To Read Garuda Purana Details, Garunda Purana Re

 ఇందులో ప్రేత కల్పం ఉండం వలన ఇంట్లో చదవచ్చా, చదవ కూడదా అన్న అనుమానం చాలా మందికి కల్గుతుంటుంది. ఎవరిని అడగాలో తెలీక చాలా మంది ఇబ్బంది పడిపోతుంటారు.

 మరికొంత మంది మనకెందు కొచ్చిందిలే అనుకొని గరుడ పురాణాన్ని ఇంట్లోకి తీసుకురావడమే మానేస్తారు.కానీ గరుడ పురాణాన్ని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

Advertisement

 రామాయణం, మాహా భారతం లాగే దీన్ని కూడా ఇంట్లో ఉంచుకొని చదువుకోవచ్చు. ఈ గరుడ పురాణం వ్యాస విరచితం.

 ఈ పురాణంలో ముఖ్యమంగా మనిషి మరణించిన తర్వాత వెళ్లే నరక లోకం వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటినెలా ప్రాయశ్చితం చేసుకోవాలే విషయాలు కూడా ఉంటాయి.

పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ రకాల మార్గాలను కూడా వ్యాస మహర్షి ఇందులో వివరించారు. పితృ కార్యాల వర్ణన గురించి క్లుప్తంగా ఉంటుంది.

 అన్ని పురాణాల్లాగే దీన్ని కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు. అంతే కాదండోయ్ ఈ గరుడ పురాణాన్ని ఎవరికైనా బహుకరించవచ్చునట కూడా.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

 కాకపోతే హంస ప్రతిమతో కానుకగా ఇవ్వాలని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు