'ఆర్‌ఆర్‌ఆర్‌' గ్లిమ్స్ గురించి హాలీవుడ్ స్టార్స్ కామెంట్స్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి బాహుబలి సినిమా తో టాలీవుడ్ రెంజ్‌ ను బాలీవుడ్ వరకు తీసుకు వెళ్లాడు.

తెలుగు సినిమా లకు ఇంత సత్తా ఉందా అనే ఫీలింగ్ ను బాలీవుడ్ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ చర్చించుకునే విధంగా జక్కన్న రాజమౌళి చేశారు అనడంలో సందేహం లేదు.

బాలీవుడ్‌ లో బాహుబలి సినిమా ను ఏ రేంజ్ లో ఆడించాడో.అక్కడ జనాల్లోకి తీసుకు వెళ్లాడో అప్పుడు అదే తరహా లో ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాకు సంబంధించిన విషయాలతో హాలీవుడ్ జనాల్లో ఆసక్తి కలిగిస్తున్నాడు.

ఈమద్య కాలంలో మన సినిమా ల గురించి హాలీవుడ్‌ వారు పెద్దగా చర్చించిన దాఖలాలు లేవు.కాని ఇప్పుడు ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా వల్ల ఇండియన్ సినిమా గురించి హాలీవుడ్‌ మీడియాలో మరియు హాలీవుడ్‌ ప్రముఖుల నోట్లో ఇండియన్‌ సినిమా చర్చ జరుగుతోంది.

ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కు సంబంధించిన గ్లిమ్స్ విడుదల అయిన తర్వాత హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ కూడా వావ్‌ అంటూ ఆశ్చర్యంను వ్యక్తం చేస్తున్నారు.వారు సోషల్‌ మీడియాలో ఈ సినిమా విజువల్స్ గురించి స్పందిస్తున్నారు.

Advertisement
Hollywood Film Makers Reaction On RRR Movie Glimpse , Hollywood Film Makers , H

హాలీవుడ్‌ కు చెందిన ఫిల్మ్‌ మేకర్స్ కు కొందరికి ఇండియన్‌ సినిమా పై తప్పుడు అభిప్రాయం ఉంది.చిన్న చూపు ఉంది.

అందుకే వారికి సరైన సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతో ఆర్ ఆర్‌ ఆర్‌ గ్లిమ్స్ ను అది రేంజ్ లో హాలీవుడ్‌ మూవీస్ కు తగ్గకుండా ప్లాన్‌ చేశాడు.నిన్న మొన్నటి వరకు ఇండియన్‌ సినిమాను తప్పు చేసి తక్కువ చేసి మాట్లాడారో వారే ఇప్పుడు అబ్బుర పడుతున్నారు.

ఆశ్చర్య పోతున్నారు.అసలు ఇలాంటి వండర్ ను క్రియేట్‌ చేసినందుకు గాను జక్కన్న రాజమౌళికి వారు అభినందనలు తెలియజేస్తున్నారు.

కొందరు ఈగో తో బయట పడకున్నా కొందరు మాత్రం ఇండియన్‌ అద్బుత దర్శకుడు అంటూ రాజమౌళి అంటున్నారు.ఇలాంటి సినిమా లతో ఇండియన్‌ సినిమాల స్థాయి ప్రపంచ ప్రేక్షకుల దృష్టికి తీసుకు వెళ్లే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

హాలీవుడ్‌ లో పలు భాషల్లో ఈ సినిమా ను విడుదల చేయబోతున్నారు.బాహుబలి రెండు వేల కోట్లు వసూళ్లు చేస్తే ఈ సినిమా హాలీవుడ్‌ సినిమా రేంజ్ లో నాలుగు అయిదు వేల కోట్లు వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను అభిప్రాయంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Hollywood Film Makers Reaction On Rrr Movie Glimpse , Hollywood Film Makers , H
Advertisement

ఆ స్థాయి లో రాకున్నా కూడా బాహుబలి రికార్డు ను మాత్రం బీట్‌ చేస్తుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.ఏం జరుగుతుందో తెలియాలంటే వచ్చే ఏడాది జనవరి వరకు వెయిట్‌ చేయాల్సిందే.సంక్రాంతి పండుగ ముందు ఈ సినిమా రాబోతుంది.

తాజా వార్తలు