నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి చేసిన లేటెస్ట్ మూవీ ‘హిట్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
పూర్తి కాప్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన సంగతి తెలిసిందే.
ఈ హీరోకు హిట్ సినిమాతో అదిరిపోయే సక్సెస్ లభించింది.కాగా ఈ సినిమాలో విశ్వక్ సేన్ యాక్టింగ్‌కు జనాలు ఫిదా అయ్యారు.
ఆకట్టుకునే కథాంశం, అదిరిపోయే సస్పెన్స్ అంశాలు కలగలిసి ఈ సినిమాకు మంచి టాక్‌ను తెచ్చిపెట్టాయి.ఇక ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు కూడా రావడంతో సినిమాను చూసేందుకు జనం ఎగబడ్డారు.ఇక ఈ సినిమా టోటల్ రన్ పూర్తి చేసుకున్న సమయానికి ప్రపంచవ్యాప్తంగా రూ.6.87 కోట్ల మేర వసూళ్లు సాధించింది.శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాతో విశ్వక్ సేన్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు.
ఇక ఏరియాల వారీగా ఈ సినిమా కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.నైజాం - 3.05 కోట్లు సీడెడ్ - 0.49 కోట్లు వైజాగ్ - 0.66 కోట్లు ఈస్ట్ - 0.32 కోట్లు వెస్ట్ - 0.28 కోట్లు కృష్ణా - 0.47 కోట్లు గుంటూరు - 0.43 కోట్లు నెల్లూరు - 0.19 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - 5.89 కోట్లు రెస్టాఫ్ ఇండియా - 0.26 కోట్లు రెస్టాఫ్ వరల్డ్ - 0.72 కోట్లు టోటల్ వరల్డ్‌వైడ్ - 6.87 కోట్లు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy