‘‘ హిందూ కెనడియన్లు భయపడుతున్నారు ’’ .. భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య వ్యాఖ్యలు

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్యతో ప్రస్తుతం భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం వుండొచ్చన్న కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఇరు దేశాలు ఇప్పటికే దౌత్యవేత్తలను బహిష్కరించాయి.అయితే కెనడాలో వుంటున్న సిక్కుయేతర మతస్తులు ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారు.

Hindu-canadians Are Fearful’ Indian Origin Mp From Trudeaus Party Alleges �

భయపడినట్లుగానే సిక్స్ ఫర్ జస్టిస్( Six for Justice ) (ఎస్ఎఫ్‌జే) తీవ్రంగా స్పందిస్తోంది.హిందువులంతా తక్షణం కెనడాను వదిలిపెట్టాల్సిందిగా ఎస్ఎఫ్‌జే హెచ్చరించింది.నిజ్జర్ హత్యకు గాను భారతదేశానికి మద్ధతుగా హింసను ప్రోత్సహించినందుకు కెనడాను విడిచిపెట్టాల్సిందిగా అల్టీమేటం జారీ చేసింది.

ఇక్కడున్న హిందువులు భారతదేశానికి మద్ధతు ఇవ్వడమే కాకుండా.ఖలిస్తాన్ మద్ధతుదారుల ప్రసంగాలు, వ్యక్తీకరణను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్ఎఫ్‌జే ఆరోపించింది.

Advertisement
Hindu-Canadians Are Fearful’ Indian Origin Mp From Trudeau's Party Alleges �

ఈ మేరకు ఆ సంస్థ కీలక నేత, న్యాయవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ( Gurupatwant Singh Pannu ) ఓ వీడియోను విడుదల చేశారు.

Hindu-canadians Are Fearful’ Indian Origin Mp From Trudeaus Party Alleges �

ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య( Canadian MP Chandra Arya ) స్పందించారు.హిందూ కెనడియన్లు అప్రమత్తంగా వుండాలని సూచించారు.ఖలిస్తాన్ అనుకూల గ్రూప్ సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణను కూడా ఎత్తిచూపారు.

ఎస్ఎఫ్‌జే సంస్థకు చెందిన గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇప్పటికే హిందూ కమ్యూనిటీ సభ్యులను కెనడాను వదిలి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించిన విషయాన్ని చంద్ర ఆర్య గుర్తుచేశారు.హిందూ కెనడియన్లను రెచ్చగొట్టి హిందూ, సిక్కు వర్గాలను విభజించేందుకు గురుపత్వంత్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

దేశంలోని అత్యధిక సంఖ్యలో వున్న సిక్కు సమాజం ఖలిస్తాన్ ఉద్యమానికి మద్ధతు ఇవ్వడం లేదని చంద్ర ఆర్య గుర్తుచేశారు.చంద్ర ఆర్య.అధికార లిబరల్ పార్టీ ఆఫ్ కెనడాకు చెందిన ఎంపీ, ప్రధాని జస్టిన్ ట్రూడోకు అత్యంత సన్నిహితంగా వుండే నేతల్లో ఆయన కూడా ఒకరు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఉగ్రవాదాన్ని కీర్తించడం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో ద్వేషపూరిత నేరాలను అనుమతించడాన్ని ఆయన ఖండించారు.

Advertisement

తాజా వార్తలు