ఎన్ఆర్ఐ ఇంటి ఆక్రమణ , భూ కబ్జా ఆరోపణలు .. పంజాబ్ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సరబ్‌జిత్ కౌర్( Saravjit Kaur Manuke ) మనుకే చిక్కుల్లో పడ్డారు.

ఓ వృద్ధురాలు, కెనడా పౌరుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన పంజాబ్, హర్యానా హైకోర్ట్.

ఎమ్మెల్యే, పంజాబ్ ప్రభుత్వం, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది.పిటిషనర్ అమర్‌జిత్ కౌర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే సరబ్‌జిత్ కౌర్ తమ ఆస్తులను లాక్కోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.జస్టిస్ వికాస్ బహ్ల్( Justice Vikas Bahl ) ధర్మాసనం ముందు ఉంచిన తన పిటిషన్‌‌లో.

న్యాయవాదులు పీఎస్ అహ్లువాలియా, ఇషాన్ గుప్తా, కీరత్ ధిల్లాన్‌లు వాదించారు.పిటిషనర్ జాగ్రావ్‌లోని ఇంటి యజమాని అని కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

తన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు నివాసం వుంటున్నారని.తన ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని అమర్‌జిత్ తన కోడలు ద్వారా ఫిర్యాదు చేసింది.

విచారణలో ఎమ్మెల్యే సరబ్‌జిత్ తన ఇంటిని ఆక్రమించుకునట్లు బాధితురాలికి తెలిసింది.

కాగ్నిజబుల్ నేరాలను వెల్లడిస్తూ ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని జస్టిస్ బహ్ల్‌ దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు. కరమ్ సింగ్ ప్రకటనతో జూన్ 19న ఎఫ్ఐఆర్ నమోదైంది.మార్చి 21, 2005 నాటి పవర్ ఆఫ్ అటార్నీకి సూచనగా పిటిషనర్ అశోక్ కుమార్‌కు అనుకూలంగా అమలు చేసినట్లు అందులో పేర్కొన్నారు.

అయితే పవర్ ఆఫ్ అటార్నీ( Power of Attorney ) నకిలీదని.అశోక్ కుమార్ అనే వ్యక్తికి బాధితురాలు ఎలాంటి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వలేదని పేర్కొన్నారు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

ఇంత జరిగినప్పటికీ పోలీసులు ఎలాంటి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయలేదు.అలాగే అది నకిలీ పత్రమని విచారణ సమయంలో నిరూపించడానికి పవర్ ఆఫ్ అటార్నీపై సంతకాలతో పోల్చడానికి ఆమె సంతకాలను తీసుకోలేదని న్యాయవాదులు కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

ఎఫ్ఐఆర్‌లో అశోక్ కుమార్ అనే వ్యక్తిని నిందితుడిగా చేర్చారని, బాధితురాలికి అతనితో రాజీ కుదిరిందని దర్యాప్తు అధికారి పేర్కొనడంతో అతనికి ముందస్తు బెయిల్ మంజూరైందని వాదించారు.అశోక్ కుమార్‌కు అనుకూలంగా తప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ తయారు చేశారని.ఇతను కరమ్ సింగ్‌కు అనుకూలంగా మే 11 నాటి సేల్ డీడ్‌ను అమలు చేశారని పేర్కొన్నారు.

తాజా వార్తలు