ప్రజావాణి విజ్ఞప్తులను సత్వర పరిష్కారం చూపాలి..అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు, విజ్ఞప్తులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జిల్లా అదనపు కలెక్టర్లు బి.

 Prompt Resolution Of Public Appeals Should Be Given Anurag Jayanti , Anurag Jaya-TeluguStop.com

సత్య ప్రసాద్, ఎన్.ఖీమ్యా నాయక్ లతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు.

ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ లిఖితపూర్వక వివరణ అందజేయాలన్నారు.ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 39 దరఖాస్తులు వచ్చాయన్నారు.

ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్.డి.వో., ఆనంద్ కుమార్, వేములవాడ ఆర్డీఓ పి.మధుసూధన్, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి గంగయ్య , జిల్లా అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube