పిల్లలు కనే అవకాశం ఉండి కూడా సరోగసీ లో బిడ్డలను కన్నా హీరోయిన్స్ వీరే !

తల్లి అవ్వడం అంటే నిజంగా అదొక వరం అనే భావించే సమాజంలోనే ప్రస్తుతం మనం ఉన్నాం.

ఏ మహిళ కైనా కూడా మాతృత్వం మధురిమలు అందుకోవాలని కుతూహలం ఎప్పుడూ ఉంటుంది.జీవితంలో ఎంత ఎత్తు ఎదిగిన కూడా ఒక బిడ్డకు తల్లి అయితేనే ఆ ఆనందం, ఆ సంతోషం కలుగుతుంది.వారసులైతే కావాలి కానీ తన గర్భం నుంచి పిల్లలు కావడానికి ఇష్టపడటం లేదు నేటి రోజుల్లో.

సాధారణ మహిళలకు అయితే తప్పదు కానీ సెలబ్రిటీలు అయ్యారంటే అందాన్ని కాపాడుకోవాలి, అవకాశాలు దక్కించుకోవాలి.అందుకే పిల్లల్ని కంటే షేప్ అవుట్ అవుతాం అనే భయంతో సరోగసి ద్వారా అద్దె గర్భంతో పిల్లల్ని కనడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొంతమంది హీరోయిన్స్ అలా సరోగసి పద్ధతిలో పిల్లల్ని కనడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అద్దె గర్వంతో పిల్లల్ని కన్నా ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం.నయనతార

దర్శకుడు విగ్నేష్ ని కొన్నేళ్లపాటు ప్రేమించి నాలుగు నెలల క్రితమే పెళ్లి చేసుకుంది నయనతార.కానీ పిల్లల్ని కనే వయసు దాటిపోతున్నప్పటికీ పిల్లల్ని కనకుండా సరోగసి పద్ధతిలో ఇద్దరి కవల పిల్లలకి జన్మ ఇచ్చింది.నాలుగు నెలలకే ఇలా కవలలకు సరోగసి ద్వారా జన్మనివ్వడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.

కానీ అవకాశం ఉన్నప్పుడు కనాలి కానీ ఇలా అద్దె గర్భంతో శరీరాకృతిని కాపాడుకోవడానికి పిల్లల్ని కనడం ఎందుకు అంటూ పెదవి విస్తృస్తున్నారు.శిల్పా శెట్టి

శిల్పా శెట్టికి రాజ్ కుంద్రా తో వివాహం జరిగిన తర్వాత ఒక కుమారుడికి కూడా జన్మనిచ్చింది కానీ మరోమారు పిల్లల్ని కంటే ఆమె శరీరాకృతి ఎక్కడ పాడవుతుందో అనే భయంతో అద్దె గర్భం ద్వారా ఒక పాపకు జన్మనిచ్చింది.పిల్లలు కావాలి కానీ పిల్లల్ని కనడానికి ఇష్టపడకుండా సరోగసితో శిల్పా శెట్టి కూతురికి జన్మనివ్వడం అప్పట్లో వివాదం అయింది.సన్నీ లియోన్

శృంగార తారగా పేరుగాంచిన సన్నిలియోన్ సైతం కవల పిల్లలకి జన్మనిచ్చింది.కానీ అది కూడా సరోగసి ద్వారానే కావడం విశేషం.అలా సరోగసీ ద్వారా కవల అబ్బాయిలకు తల్లిగా మారింది సన్నీ లియోన్.

ప్రియాంక చోప్రానిక్ జోనస్ ని పెళ్లాడిన ప్రియాంక చోప్రా సైతం ఒక అమ్మాయికి సరోగసి పద్ధతిలో జన్మించింది.సినిమాలు లేకపోయినా పిల్లలను ఎందుకు కనలేదు అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినబడ్డాయి.ప్రీతి జింటా

ప్రీతి జింటా సైతం 2021 వ సంవత్సరంలో కవలలకు జన్మనిచ్చింది.దానిలో ఒకరు అబ్బాయిగాక మరొకరు అమ్మాయి.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తాజా వార్తలు