చిరంజీవి, వెంకటేష్ తో నటించేందుకు సవాలక్ష కండీషన్లు పెట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?

ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయి అనే సామెత కరెక్టుగా సూటవుతుంది టాలీవుడ్ హీరోలకు.ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో చిరంజీవి, వెంకటేష్ సీనియర్ హీరోలుగా ఉన్నారు.

ఒకప్పుడు వీరిద్దరు ఓ రేంజిలో క్రేజ్ సంపాదించారు.అద్భుత సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాశారు.

వీరి పక్కన నటించేందుకు హీరోయిన్లు క్యూ కట్టేవారు.అవకాశం వస్తే చాలు ఎంతో హ్యాపీగా ఫీలయ్యే వారు.

అలనాటి టాప్ హీరోయిన్లు అంతా వీరిద్దరితో కలిసి నటించారు.కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.

Advertisement
Heroine Who Put Lot Of Conditions To Work, Tollywood , Venkatesh , Chiranjeevi ,

సీనియర్లు అయిన వెంకటేష్, చిరంజీవి పక్కన నటించేందుకు ఇప్పటి హీరోయిన్లు సరిపోవడం లేదు.తెలుగు సినిమా పరిశ్రమలోని అందరు సీనియర్ హీరోల పరిస్థితి ఇలాగే ఉంది.

అయితే వీరి పక్కన హీరోయిన్లను ఎంపిక చేయడంలో దర్శక నిర్మాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు.అయితే గతంలో వీరిద్దరితో నటించేందుకు ఓ హీరోయిన్ ఓకే చెప్పింది.

కానీ సవాలక్ష కండీషన్లు పెట్టి దర్శక నిర్మాతలతో పాటు హీరోలనూ తెగ ఇబ్బంది పెట్టిందట.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

వెంకటేష్, చిరంజీవి సరసన నటించేందుకు ఓకే చెప్పిన హీరోయిన్ మరెవరో కాదు.నయనతార.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

వెంకటేష్ తో కలిసి బాబు బంగారం సినిమా చేసిన ఆమె.చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డిలోనూ నటించింది.

Heroine Who Put Lot Of Conditions To Work, Tollywood , Venkatesh , Chiranjeevi ,
Advertisement

ఈ రెండు సినిమాలు చేస్తున్న సమయంలో తను చాలా కండీషన్లు పెట్టిందట.హీరోలు తనను ముట్టుకోవద్దని చెప్పిందట.సినిమా ప్రమోషన్స్ కూడా తాను రానన్నదట.

అంతేకాదు సినిమా షూటింగ్ కు కూడా చాలా లేటుగా వచ్చేదట.

కేవలం నయనతార మూలంగానే బాబు బంగారం సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయ్యిందట.సరైన ఔట్ ఫుట్ కూడా రాలేదట.దర్శకుడు మారుతి నయనతార తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడట.

కేవలం నయనతార షెడ్యూల్స్ లేట్ కావడం వల్లే సినిమా షూటింగ్ ఆలస్యమైనట్లు ఆయన వెల్లడించాడు.అటు సైరా నర్సింహారెడ్డి విషయంలోనూ ఆమె ఇలాగే చేసిందట.

సినిమా యూనిట్ తో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి సైతం అసహనానికి గురి చేసిందదట.నయనతార తీరుపట్ల చిరంజీవి సైతం కోప్పడ్డట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

తాజా వార్తలు