Heroine Rozlyn Khan: క్యాన్సర్ బారిన పడిన ప్రముఖ హీరోయిన్.. ఎవరో తెలుసా?

క్యాన్సర్. ఇదొక ప్రాణాంతకమైన వ్యాధి.

ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడి ఎంతో మంది మరణించిన విషయం తెలిసిందే.

కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఈ క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే.

ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పలువురు హీరోలు హీరోయిన్ లు ఈ క్యాన్సర్ బారిన పడి ఈ క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొని ప్రాణాలతో బతికి బయటపడ్డారు.ఇప్పటికే సోనాలి బింద్రే, మనీషా కోయిరాలా,గౌతమి, మమతా మోహన్ లాంటి హీరోయిన్ లు క్యాన్సర్ మహమ్మారితో పోరాడి బతికి బయటపడిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక హీరోయిన్ తనకు క్యాన్సర్ వచ్చింది అన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది.మరి ఆ హీరోయిన్ ఎవరు అన్న విషయానికి వస్తే.

Advertisement

ముంబై కి చెందిన రోజ్లిన్ ఖాన్ మొదట మోడల్ గా కెరియర్ ను ప్రారంభించింది.ఐపీఎల్ కోసం ఫోటోషూట్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇకపోతే ఈమె కెరియర్ విషయానికొస్తే 2012లో దమా చౌడ్కి అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తరువాత సవితా బాబి, జీ లేనే దో ఏక్ పల్ ఇలాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

బుల్లితెరపై కూడా క్రైమ్ అలర్ట్ షోలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కాగా తాజాగా ఆమె క్యాన్సర్ వచ్చింది అన్న విషయాన్ని ధైర్యంగా చెబుతూ హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.ఈ సందర్భంగా ఫోటోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.బలమైన సైనికులకే దేవుడు కష్టమైన యుద్ధాలని అప్పగిస్తాడు.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

ఇది నా జీవితంలో ఒక భాగం మాత్రమే.నమ్మకంతో ముందుకు సాగడమే.

Advertisement

ప్రతి ప్రాబ్లం నన్ను మరింత స్ట్రాంగ్ గా చేస్తుంది.ఇది కూడా అంతే.

నేను త్వరగా కోలుకోవాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.ప్రస్తుతానికి మెడ నొప్పి వెన్ను నొప్పి తప్పితే మరేమీ లేదు.

ఏదైతేనేం ఈ క్యాన్సర్ ను ప్రారంభంలోనే గుర్తించగలిగాం అని రాసుకొచ్చింది.

తాజా వార్తలు