ఆ దర్శకుడు లేకపోతే నేనేమైపోయేదాన్నో.. రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్!

స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణకు ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అభిమానించే అభిమానులు ఉన్నారు.

బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగింది.

అయితే కెరీర్ తొలినాళ్లలో రమ్యకృష్ణ నటించిన పలు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.అయితే తనకు స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కడానికి రాఘవేంద్రరావు కారణమని రమ్యకృష్ణ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

రమ్యకృష్ణ హీరోయిన్ గా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో అల్లుడుగారు అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.అల్లుడు గారు సినిమాలో మూగమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించి రమ్యకృష్ణ ప్రేక్షకులను మెప్పించారు.

ఆ తర్వాత అల్లరి మొగుడు సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ లో నటించి ఆ సినిమాతో మరో సక్సెస్ ను రమ్యకృష్ణ ఖాతాలో వేసుకున్నారు.తర్వాత కాలంలో కూడా రాఘవేంద్ర రావు తన సినిమాల్లో ఛాన్స్ ఇచ్చి రమ్యకృష్ణను ప్రోత్సహించారు.

Advertisement
Heroine Ramyakrishna Interesting Comments About Raghavendra Rao , Allari Priyudu

అల్లుడుగారు సినిమాకు ముందు పలు సినిమాల్లో రమ్యకృష్ణ నటించగా ఆ సినిమాలు ఫ్లాప్ కావడంతో రమ్యకృష్ణపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది.అల్లరి మొగుడు సినిమా 100 డేస్ ఫంక్షన్ లో రమ్యకృష్ణ మాట్లాడుతూ చాలామంది తనను అదృష్టం లేని ఆర్టిస్ట్ అని చెప్పారని కొన్ని సినిమాల నుంచి తనను తొలగించారని కానీ అల్లరి మొగుడు సినిమాలో ఛాన్స్ రావడం అదృష్టమని రమ్యకృష్ణ పేర్కొన్నారు.

Heroine Ramyakrishna Interesting Comments About Raghavendra Rao , Allari Priyudu

సక్సెస్ మీట్ లో రమ్యకృష్ణ ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకున్నారు.ఆ తర్వాత ఒక షోలో రమ్యకృష్ణ మాట్లాడుతూ రాఘవేంద్రరావు సినిమాలలో అవకాశాలు దక్కకపోయి ఉంటే తాను సిస్టర్ పాత్రలకు పరిమితం కావాల్సి వచ్చేదని చెప్పారు.రాఘవేంద్రరావు లేకపోతే ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చేదని లైఫ్ లాంగ్ రాఘవేంద్ర రావుకు రుణపడి ఉంటానని రమ్యకృష్ణ పేర్కొన్నారు.

రమ్యకృష్ణ నటించిన రిపబ్లిక్ ఈ నెల 1వ తేదీన విడుదలై బిలో యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు