Actress Rashi Assets : ప్రముఖ టాలీవుడ్ నటి రాశి ఆస్తుల విలువెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఇతర రంగాలతో పోల్చి చూస్తే సినిమా రంగంలో పని చేసేవాళ్లకు ఆదాయం ఎక్కువ అనే సంగతి తెలిసిందే.

బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన రాశి ప్రస్తుతం పలు టీవీ సీరియళ్లలో నటిస్తూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

రాశి నటించిన సీరియళ్లకు రికార్డ్ స్థాయిలో రేటింగ్స్ వస్తుండటంతో పాటు ఆమె రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సినిమాల ద్వారా రాశి బాగానే ఆస్తులు కూడబెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే ఒక ఇంటర్వ్యూలో రాశి మాట్లాడుతూ తన ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.రాశి మాట్లాడుతూ వెనక్కు తిరిగి చూస్తే నా చైల్డ్ హుడ్ డేస్ గుర్తొస్తాయని అన్నారు.

నేను ఆ సమయంలో బిజీబిజీగా షూటింగ్స్ లో పాల్గొన్నానని రాశి వెల్లడించారు.నేను డబ్బులు ఏమీ పోగొట్టుకోలేదని ఆమె అన్నారు.

Advertisement

సినిమాలలో ఛాన్స్ ల కోసమే బరువు తగ్గానని ప్రేక్షకులు నన్ను ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో అదే విధంగా కనిపించాలని భావిస్తున్నానని రాశి తెలిపారు.రాశి నిక్ నేమ్ మంత్ర కావడం గమనార్హం.ఏపీలోని బెజవాడలో జన్మించిన రాశి చెన్నైలో చదువుకున్నారు.ఆదిత్య369 సినిమాలో రాశి నటించారనే విషయం చాలామంది అభిమానులకు తెలియదు.ప్రస్తుతం రాశి వయస్సు 42 సంవత్సరాలు.

5000 రూపాయల పారితోషికంతో కెరీర్ ను మొదలుపెట్టిన రాశి ఆస్తుల విలువ 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం.రాశి దగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయని బోగట్టా.జూబ్లీహిల్స్ లో రాశి ఖరీదైన అపార్టుమెంట్ లో ఉంటున్నారని ఈ అపార్టుమెంట్ విలువ 2.5 కోట్ల రూపాయలు అని బోగట్టా.80కు పైగా సినిమాలలో రాశి హీరోయిన్ గా నటించారు.రాబోయే రోజుల్లో హీరోయిన్ రాశి సినిమాలతో మళ్లీ బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు