పిట్ట గోడపై క్యాట్ వాక్ చేస్తూ అర్దాంతరంగా కన్ను మూసిన టాలీవుడ్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు గా గుర్తింపు పొందినప్పటికీ కొంతమందికి మాత్రం గుర్తింపు రాకుండా పోతుంది.

అందంగా ఉండి చాలా బాగా నటించినప్పటికీ వాళ్లకి గుర్తింపు రాకుండా పోతుంది గుర్తింపు తెచ్చుకున్న కొందరు మాత్రం ఆ గుర్తించిన నిలబెట్టుకోలేక పోతున్నారు.

కొందరు గుర్తింపు ఉండి నిలబెట్టుకున్న కానీ ఎక్కువ కాలం బతకలేక మధ్యలోనే వాళ్ళ జీవితాన్ని ముగించేస్తున్నారు అలాంటి వారిలో ఒకరు నివేదిత జైన్.నివేదిత జైన్ 90వ దశకంలో కన్నడలో అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.

ఆమె నార్త్ ఇండియన్ లేడీ అయినప్పటికీ కర్ణాటకలో జరిగిన బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొని మిస్ బెంగళూరు గా ఎంపికయ్యారు ఆ క్రేజ్ తోనే ఆవిడకు కన్నడలో శివరంజని సినిమాలో అవకాశం వచ్చింది, ఆ సినిమా మంచి విజయం సాధించడంతో కన్నడలో టాప్ హీరోలందరితో నటించే అవకాశం వచ్చింది.అలా వాళ్లతో ఆడిపాడుతూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకుంది కన్నడలో వరుసగా సినిమాలు చేస్తూ తెలుగులో కోన వెంకట్ నిర్మించిన మొదటి సినిమా అయిన తోక లేని పిట్ట సినిమాలో నరేష్ పక్కన హీరోయిన్ గా నటించారు.

Heroine Niveditha Jain Real Life Sad Ending, Heroine Niveditha Jain,niveditha Ja

ఈ సినిమాకి ప్రముఖ కమెడియన్ అయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు దర్శకత్వం వహించారు ఆయన దర్శకత్వంలో వచ్చిన మొదటి చిత్రం, చివరి చిత్రం ఈ సినిమానే అవ్వడం విశేషం.అయితే తోకలేని పిట్ట సినిమా ఫ్లాప్ అవడంతో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఇంకో సినిమా చేయలేదు కానీ ఈ సినిమాతో హీరోయిన్ గా నివేదిత జైన్ మంచి గుర్తింపు సాధించారు.తెలుగులో వరుసగా అవకాశాలు వస్తాయి అని అనుకున్నారు అందరు కానీ మనం అనుకున్నట్టుగా జరగదు కదా 1998లో బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొనడానికి ఆవిడ 35 అడుగుల ఎత్తులో ఉన్న గోడపై నుంచి క్యాట్ వాక్ చేస్తుంటే కాలు జారి కిందపడిపోయారు.

Advertisement
Heroine Niveditha Jain Real Life Sad Ending, Heroine Niveditha Jain,Niveditha Ja

దాంతో ఆవిడ తలకి బలమైన గాయం తగిలింది 20 రోజులపాటు కోమాలో ఉన్న ఆవిడ డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ప్రాణాన్ని కాపాడలేకపోయారు.దీంతో డాక్టర్లు అధికారికంగా ఆవిడ మరణాన్ని ధృవీకరించడం తో జనాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాల్సిన నివేదిత జైన్ అర్థాంతరంగా తనువు చాలించడం వల్ల వాళ్ల ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్,ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకపోయారు.

ఇంకా కొందరు అయితే బ్యూటీ కాంపిటీషన్ లో ఆవిడ పాల్గొనడం ఇష్టంలేక వాళ్ళ అమ్మనే మేడపై నుంచి తోసేసింది అని చెప్పుకుంటూ ఉంటారు ఏది నిజం అనేది మనం చెప్పలేం గానీ, సినిమా ఇండస్ట్రీలో మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అనడానికి నివేదిత జైన్ ని ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.అన్ని బాగుంటే అప్పట్లో టాప్ హీరోయిన్ గా కొనసాగేదని ఇప్పటికీ చాలామంది అంటుంటారు.

ఇవే కాకుండా అప్పట్లో మంచి హీరోయిన్ గా పేరు సంపాదించాల్సిన చాలామంది అర్ధాంతరంగా చనిపోవడం అనేది చాలా బాధ కలిగించే విషయం ఈవిడ లానే తెలుగులో మంచి గుర్తింపు సాధించిన హీరోయిన్ దివ్యభారతి కూడా అర్ధాంతరంగా చనిపోయారు.తెలుగులో రౌడీ అల్లుడు, బొబ్బిలిరాజా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన దివ్యభారతి కూడా మధ్యలోనే తనువు చాలించడం అనేది అప్పట్లో చాలామంది జీర్ణించుకోలేకపోయారు.

అలాగే ప్రత్యూష కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపును సాధించుకుంటున్న తరుణంలోనే ఆవిడ కూడా చనిపోవడం అనేది తెలుగు అభిమానులందరికీ బాధను కలిగించింది.ఏదేమైనా ఇండస్ట్రీలో లైమ్ లైట్ లో ఉన్నప్పుడు చాలామంది మనల్ని గుర్తిస్తూ మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో ఎవరు ఎలాంటి వారు అనేది గుర్తించుకుంటూ మన లైఫ్ లో మనం ముందుకు తీసుకెళ్లాలీ మనం ఎదుగుతున్న క్రమంలోనే మనల్ని కిందికి దిగజార్చే మనుషులు పరిచయం అవుతుంటారు వాళ్లందరినీ పక్కన పెడుతూ మన లక్ష్యం మీద మనం ఫోకస్ పెట్టి ముందుకు సాగాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు