డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం జాతి రత్నాలు ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.మొదటి సినిమాతోనే చిట్టి పాత్రలో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె అనంతరం నాగచైతన్య నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు.
అయితే హీరోయిన్ గా ఈమె లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇది ఈమెకు రెండవ సినిమా.
ఈ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన ఫేవరెట్ హీరో హీరోయిన్ల గురించి వెల్లడించారు.ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ తాను వర్షం సినిమా చూసిన తర్వాత త్రిషకు పెద్ద అభిమానిగా మారిపోయానని తెలిపారు.
ఇలా తనకు అభిమానిగా మారడంతో తాను నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాని కూడా చూశానని తెలిపారు.

ఇలా ఈ సినిమా చూసిన అనంతరం హీరో సిద్ధార్థకు అభిమానిగా మారిపోయాను అంటూ ఈ సందర్భంగా తన ఫేవరెట్ హీరో హీరోయిన్ల గురించి ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక తనకు జాతి రత్నాలు సినిమాలో అవకాశం ఎలా వచ్చింది అనే విషయాన్ని కూడా వెల్లడించారు.ఒకరోజు తమ కాలేజ్ ఫంక్షన్ కోసం నాగార్జున గారు అటెండ్ అవడంతో మొదటి సారి ఆయనను చూసి కలవడం జరిగిందని అలాగే తన నెంబర్ తీసుకొని ఫాలో అవుతూ ఉన్నానని చెప్పారు.
ఇక జాతి రత్నాలు సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని వెళ్లడంతో ఆ సినిమాకు తాను సెలెక్ట్ అయ్యానని ఈమె వెల్లడించారు.







