వీక్ గా ఉన్న అమ్మాయిలను ట్రాప్ చేసేవాళ్లు ఉంటారు.. అర్చన కీలక వ్యాఖ్యలు?

ప్రముఖ నటి అర్చన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాధాగోపాళం సినిమాలో హీరోయిన్ గా మొదట తనకు అవకాశం దక్కిందని అయితే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో క్యారెక్టర్ రోల్ చేయడం వల్ల తనకు రాధాగోపాళం సినిమాలో ఛాన్స్ పోయిందని అర్చన చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో హీరోయిన్ కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు వేర్వేరు ఇమేజ్ లు ఉంటాయని అర్చన వెల్లడించారు.

రాధాగోపాళం చేసి ఉంటే ఆ సినిమా కెరీర్ కు ప్లస్ అయ్యేదని అర్చన పేర్కొన్నారు.రవితేజ కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రలు చేసి హీరో స్థాయికి ఎదిగారని అర్చన అన్నారు.

ఇప్పుడు తనకు పేరుతో పాటు మంచి గుర్తింపు ఉందని అర్చన వెల్లడించారు.యమదొంగ మంచి ప్రాజెక్ట్ అని అందుకే ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పానని అర్చన అన్నారు.

రాజమౌళి, రాఘవేంద్రరావు డైరెక్షన్ లో చిన్నచిన్న పాత్రలు చేసినా ఆ పాత్రలు కెరీర్ కు ప్లస్ అవుతాయని అర్చన వెల్లడించారు.

Heroine Archana Shastry Comments About Industry Situations, Archana Shastry, Tol
Advertisement
Heroine Archana Shastry Comments About Industry Situations, Archana Shastry, Tol

ఇప్పుడు ఆడవాళ్లకు సినిమాలలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు వస్తున్నాయని రంగస్థలంలోని రంగమ్మత్త పాత్ర తనకు ఎంతో నచ్చిందని ఆడవాళ్లకు నెగిటివ్ లీడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయని అర్చన పేర్కొన్నారు.కొన్నిసార్లు చెప్పిన కథకు, పాత్రకు సంబంధం ఉండేది కాదని అర్చన వెల్లడించారు.ఒక సినిమా విషయంలో అలా జరగడంతో డబ్బులు తీసుకోకుండా ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చానని అర్చన పేర్కొన్నారు.

Heroine Archana Shastry Comments About Industry Situations, Archana Shastry, Tol

ఏడుపుకు వీక్ కు చాలా తేడా ఉంటుందని అర్చన అన్నారు.ఒక అమ్మాయి వీక్ గా అయితే ఆ అమ్మాయి మైండ్ ను క్యాప్చర్ చేయడానికి కొంతమంది పీపుల్ ఉంటారని అర్చన వెల్లడించారు.ఫ్యామిలీ సపోర్ట్ లేని అందంగా ఉండే అమ్మాయిల మైండ్ ను క్యాప్చర్ చేసే కొంతమంది వ్యక్తులు ఉన్నారని అర్చన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు