కేజిఎఫ్ 3 సలార్ 2 మధ్య కనెక్షన్ ఉందా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన హీరో యష్!

కన్నడ చిత్రపరిశ్రమలో హీరోగా కొనసాగుతూ చిన్న చిన్న సినిమాలలో నటిస్తూ మంచి ఆదరణ సొంతం చేసుకున్న నటుడు యశ్( Yash ) కేజిఎఫ్ సినిమా ( KGF Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకొని ఈయన కూడా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా రెండో భాగం కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో పార్ట్-3 కూడా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు.

ఇక కే జి ఎఫ్ పార్ట్ 3 ఎప్పుడు రాబోతుంది అనే విషయం గురించి ప్రతి ఒక్క అభిమానిలో కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి.అయితే ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) కూడా టాలీవుడ్ హీరోలతో వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు.మరోవైపు హీరో యాష్ కూడా టాక్సిక్ అనే సినిమాకు కమిట్ అయ్యారు.

దీంతో కేజిఎఫ్ పార్ట్ 3 ఎప్పుడు రాబోతుందన్న సందేహం అందరిలోనూ ఉంది.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్ ఈ విషయం గురించి కీలక విషయాలు వెల్లడించారు.

Advertisement

ప్రస్తుతం తాను టాక్సిక్ సినిమాలో నటిస్తున్నాను నిజానికి ఈ సినిమా వచ్చేయేడాది ఏప్రిల్ 10వ తేదీ విడుదల చేయాలని భావించారు.కానీ అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల కావడం లేదని తెలిపారు.ఈ సినిమాతో పాటు రామాయణ సినిమాలో తాను రావణుడిగా నటించబోతున్నానని తెలిపారు.

ఇలా ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తి అయిన తరువాతనే కేజిఎఫ్ త్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.ఈలోగా ప్రశాంత్ కూడా ఎన్టీఆర్ అలాగే సలార్ 2 సినిమాలను కూడా పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

  కేజిఎఫ్ పార్ట్ 3, సలార్ పార్ట్ 2 తో కనెక్షన్ ఉందంటూ గతంలో వార్తలు వచ్చాయి.అయితే ఈ రెండు సినిమాలకు ఎలాంటి కనెక్షన్ లేదంటూ యష్ క్లారిటీ ఇచ్చారు.

కెనడా : భారత సంతతి యువతి మరణంపై ముగిసిన దర్యాప్తు.. ఏం తేల్చారంటే?
Advertisement

తాజా వార్తలు