పదేళ్ల బాలుడి ప్రాణాలు కాపాడిన విజయ్.. ఏం జరిగిందంటే?

సినిమా హీరోలకు అభిమానులు ఉంటారన్న సంగతి తెలిసిందే.ఇక కొందరు హీరోలకు తమ అంటే పడిచచ్చే వీరాభిమానులు ఉంటారు.

పైగా వారి కోసం ఏమైనా చేస్తుంటారు.వాళ్ల సినిమాలు వస్తున్నాయంటే చాలు ఎన్ని పనులైన వదులుకొని మరి చూస్తుంటారు.

నిజానికి ఈ లోకాన్నే మరిచిపోతారు.అలాంటిది ఓ పదేళ్ల బాలుడి తన అభిమాన హీరో సినిమా చూస్తూ ప్రాణాలు కాపాడుకున్నాడు.

వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా.అసలేం జరిగిందో తెలుసుకుందాం.తమిళనాడులోని చెన్నైకి చెందిన ఓ పదేళ్ల బాలుడు ఓ ప్రమాదానికి గురయ్యాడు.

Advertisement
Hero Vijay Thalapathy Saves Ten Year Old Boy, Hero Vijay, Save Ten Year Old Boy,

దీంతో ఆయనకు తీవ్ర గాయాలు ఏర్పడగా అతడికి సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు.దీంతో ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ బాలుడు ఇంజక్షన్ తీసుకోవడానికి కూడా డాక్టర్లను ఎంతో ఇబ్బందిపెట్టాడు.

డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆ బాలుడు సహకరించలేదు.వెంటనే ఓ డాక్టర్ ఆ బాలుడికి తమిళనాడు స్టార్ హీరో విజయ్ అభిమాన హీరో అని తెలుసుకొని వెంటనే తన ఫోన్ లో బిగిల్ సినిమా చూడమని ఇచ్చాడట.

Hero Vijay Thalapathy Saves Ten Year Old Boy, Hero Vijay, Save Ten Year Old Boy,

ఇక బాలుడు తన అభిమాన హీరో సినిమాను కన్నార్పకుండా చూడటంతో తనకు జరుగుతున్న వైద్యం గురించి మర్చిపోయాడు.ఇక డాక్టర్లు ఇదే ఆసరాగా తీసుకొని అతడికి సర్జరీ చేసి తన ప్రాణాలను కాపాడారు.ఇక ఇతని కుటుంబ సభ్యులు కూడా మొత్తానికి తనకి సర్జరీ కావడంతో సంతోషపడ్డారు.

ప్రస్తుతం ఈ విషయం గురించి తమిళనాడు దినపత్రికలో ప్రచురించడంతో పాటు దీనికి సంబంధించిన క్లిప్పింగ్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.దీంతో నెటిజన్లు తన ప్రాణాలు బయటపడటానికి విజయ్ సినిమా ఎంతో మేలు చేసిందని అంటూ విజయ్ తో పాటు, వైద్యులను కూడా తెగ పొగుడుతున్నారు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

నిజానికి ఇలాంటివి గతంలో కూడా పలు చోట్ల లో జరుగగా.తమకిష్టమైన వ్యక్తులు గాని, మరి ఏదేమైనా గాని తమ ముందల ఉంటే ఈ లోకాన్ని మరిచిపోతారు అన్నట్లుగా మరోసారి ఈ బాలుడి ద్వారా బయట పడింది.

Advertisement

తాజా వార్తలు