సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోల్లో వరుణ్ తేజ్( Varun Tej ) ఒకరు ఈయన చేసిన సినిమాలు చాలావరకు మంచి విజయాలను అందుకున్నాయి ఇక ఈయన చేసిన ప్రతిసినిమా లో ఎదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు.ఇక ఈయన ఇప్పటికే ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో చేసిన గాండీవదారి అర్జున్( Gandeevadhari Arjuna ) సినిమా ఈనెల 25 వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపధ్యం లో ఆయన రీసెంట్ గా మరో కొత్త సినిమా కి కూడా కమిట్ అయినట్టు గా తెలుస్తుంది.
ఈ సినిమా ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.నిజానికి ఈ సినిమాకి ఒక స్టార్ డైరెక్టర్ చేత డైరెక్షన్ చేయాల్సి ఉంది
కానీ అది కుదరక పోవడం తో ఇప్పుడు ఆ ప్లేస్ ని ఒక కొత్త డైరెక్టర్ తో దిల్ రాజు( Dil Raju ) భర్తీ చేసినట్టు గా తెలుస్తుంది.ఆయన ఎవరు అనేది ఇంకా రివీల్ చేయలేదు కానీ కొత్త డైరెక్టర్ తో వీళ్ల కాంబో లో అయితే సినిమా ఉంటుందని తెలుస్తుంది…ఇక ప్రస్తుతం గాండీవదారి అర్జున్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న వరుణ్ ఈ సినిమా పూర్తి అయినా తర్వాత తన నెక్స్ట్ సినిమా మీద ఫుల్ గా టైం స్పెండ్ చేయాలనీ చూస్తున్నాడు.
ఇక ఈ గ్యాప్ లోనే తన పెళ్లి కూడా ఉంటుంది అనే విషయం అయితే తెలుస్తుంది…ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరోలు( Mega Heros ) కూడా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఇక అందులో భాగంగానే వరుణ్ కూడా వరుస సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇప్పటికే కెరియర్ లో ఫిదా, ఎఫ్ 2 లాంటి మంచి హిట్లు అందుకున్న ఈయన ఈ బ్యానర్ లో మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు…
.