ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నా యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్( Thiruveer ).2016లో విడుదలైన “బొమ్మలరామారం( Bommalaramaram )” చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ హీరో విభిన్న పాత్రలను, కథలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు.కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలను కూడా చేస్తూ తన వెర్సటాలిటీని చూపిస్తున్నాడు.2019లో విడుదలైన “జార్జ్ రెడ్డి” చిత్రానికి గాను ఉత్తమ ప్రతి నాయకుడు విభాగంలో జీ సినీ అవార్డు అందుకున్నాడు.తాజాగా విడుదలైన నాని “టక్ జగదీష్” చిత్రంలో కూడా విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు.తిరువీర్ హీరోగా నటించిన పలాస, మాసూదా( Masooda ) పరేషాన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి.

నటుడిగా ఇతని ప్రయాణం 2016 లో మొదలైనప్పటికీ, తిరువీర్ మొట్టమొదట ఇండస్ట్రీలో అడుగుపెట్టింది 2008 లోనట.ఆ సమయంలో కొన్ని సినిమాలలో ఎక్స్ట్రా గా చేసాడట.అప్పట్లో అస్సలు ఊహించకుండా సినిమా అవకాశం వచ్చేసరికి సినిమాలలోకి వెళ్లడం చాలా సులభం అనుకున్నాడట.కానీ చాలా కాలం సినిమాలలో ఎక్స్ట్రా గా చేసాక అర్ధమయింది అంత సులభం కాదని.
అప్పుడు మళ్ళి వెళ్లి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఎం.ఏ థియేటర్ ఆర్ట్స్ చేసాడట.

ఆ సమయంలో చాలామంది స్నేహితులు నాని, రవితేజ ( Ravi Teja )వంటి సక్సెస్ఫుల్ హీరోలను ఉదాహరణగా చూపించి, వీళ్లంతా మొదట ఆర్.జె లు గా చేసి తరువాత అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేసి తరువాత హీరోలు అయ్యారు అని చెప్పేవారట.దాంతో అదే సరైన మార్గం అనుకోని తానూ కూడా మొదట కొన్నాళ్ళు ఆర్.జె గా చేసి, తరువాత అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసాడట.ఈ హీరో కొన్నాళ్లపాటు ఈటీవీ లో ప్రసారమయ్యే అలీతో సరదాగా షోకి రైటర్ గా కూడా పనిచేసాడట.ఐతే కొన్నిసక్సెస్ఫుల్ సినిమాలలో నటించాక సినిమాల పట్ల ఈయన అభిప్రాయం మారిందట.
టాలెంట్ ఉంటె సినిమా పరిశ్రమ ఖచ్చితంగా ఆదరిస్తుందని తన అభిప్రాయాన్ని బయట పెట్టాడు ఈ కుర్ర హీరో.







