హీరో సాయి కిరణ్, ఆ హీరోయిన్ విడిపోవడానికి వారే కారణమా..?

ప్రముఖ నేపథ్య గాయకుడు రామకృష్ణ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.

ఆయన తన గానమాధుర్యంతో ఎన్నో మధురమైన పాటలు పాడి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

ఎన్టీఆర్ ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు కృష్ణ వంటి హీరోలకు కూడా ఆయన పాటలు పాడారు.మొత్తం తన కెరీర్లో 5000 పైగా పాటలు పాడి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

అయితే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామకృష్ణ తన కుమారుడిని మాత్రం వెండితెరకు పరిచయం చేయడానికి ససేమిరా అన్నారు.ఆయన తన కొడుకుని కంప్యూటర్ ఇంజనీర్ చేయాలనుకున్నారు.

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ఒప్పుకోలేదు కానీ తన కొడుకుకి సంగీతం మాత్రం బాగా నేర్పించారు.కానీ సింగర్ గా కూడా సాయి కిరణ్ ని వెండితెరకు పరిచయం చేయలేదు.

Advertisement
Hero Sai Kiran Revealed About His Love Story With Laya, Sai Kiran, Laya, Gold Me

ఐతే ఉస్మానియా యూనివర్సిటీ లో హోటల్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడల్ సాధించిన సాయి కిరణ్ తనకు నటన పట్ల ఆసక్తి ఉందని తండ్రి కి చెప్పారు.దీంతో రామకృష్ణ సాయికిరణ్ కి నటన రంగంలో అడుగుపెట్టడానికి అనుమతి ఇచ్చారు.

అయితే ఆయనకు తొలిసారిగా శివలీలలు సీరియల్ లో విష్ణుమూర్తి పాత్ర లభించింది.సీరియల్ లో నటించిన తర్వాత ఏం చేయాలో తెలియక సాయి కిరణ్ మద్రాస్ కి వెళ్లి ఓ 7 స్టార్ హోటల్ లో ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ గా జాయిన్ అయ్యారు.

Hero Sai Kiran Revealed About His Love Story With Laya, Sai Kiran, Laya, Gold Me

కొన్ని నెలల తర్వాత నువ్వే కావాలి చిత్రంలోని ఓ పాత్రలో నటించే అవకాశం సాయి కిరణ్ కి దక్కింది.ఈ సినిమాలో హీరోయిన్ ని ప్రేమించే ఒక సింగర్ గా సాయి కిరణ్ కనిపించారు."అనగనగా ఆకాశం ఉంది - ఆకాశంలో మేఘం ఉంది" అంటూ సాగే పాటలో గాయకుడిగా సాయి కిరణ్ కనిపించి మెప్పించారు.

ఈ సినిమాతో తరుణ్, రిచా, సునీల్, త్రివిక్రమ్ లతో పాటు సాయికిరణ్ కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారు.తన తోటి నటులైన ఉదయ్ కిరణ్, రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడం తాను ఎప్పటికీ జీర్ణించుకోలేని సాయికిరణ్ చెబుతుంటారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఎవరూ కూడా ఆత్మహత్య చేసుకోకూడదు అని.కష్టాలని ఎదుర్కొని చివరి వరకు జీవించాలని ఆయన చెబుతుంటారు.అయితే తాను సినీనటి లయను ప్రేమించానని.

Advertisement

ఇద్దరం పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నట్టు సాయికిరణ్ చెబుతుంటారు.అయితే ఇద్దరు కులాలు ఒకటే కావడంతో.

అలాగే సినీ ఇండస్ట్రీలో ఎటువంటి మచ్చ లేకపోవడంతో ఆయన లయ ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట.చాలా సంప్రదాయంగా, పద్ధతిగా కనిపించే లయ ను తన భార్యను చేసుకోవాలని సాయి కిరణ్ అనుకున్నప్పుడు.

లయ కుటుంబ సభ్యులు కూడా అందుకు సంతోషించారట.కానీ కొంత కాలం తర్వాత ఇరు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయట.

దాంతో తమ తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని తాను, లయ అనుకున్నట్టు సాయి కిరణ్ చెప్పారు.కానీ చిన్నప్పటి నుంచి తమని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కాదని.

లేచిపోయి పెళ్లి చేసుకుంటే.వారి కోపాగ్ని తమను దహించుకు పోతుందని భావించిన సాయి కిరణ్, లయ విడిపోవాలి అనుకున్నారట.

తర్వాత మెల్లిగా ఒకరికొకరు దూరమై ఎవరి దారినవారు వెళ్లిపోయారట.ఏది ఏమైనా తల్లిదండ్రులను బాధపెట్టకుండా తమ ప్రేమను త్యాగం చేసి సాయికిరణ్, లయ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

తాజా వార్తలు