మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో నాలుగవ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.వీరి కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమా లు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ఇప్పుడు నాల్గవ సినిమా ను మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు.రవితేజ హీరో గా ఈమధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమా లు వస్తున్నాయి.
ఆ సినిమా ల్లో ఎక్కువ శాతం ప్రేక్షకులను అలరిస్తున్నాయి.కొన్ని నిరాశ పరుచుతున్నాయి.
ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రవితేజ( Ravi Teja ) చేయబోతున్న నాల్గవ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసే విధంగా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు అంతా కూడా చాలా నమ్మకంగా ఉన్నారు.ఇక ఈ సినిమా లో ఇద్దరు హాట్ బ్యూటీస్ హీరోయిన్స్ గా నటించబోతున్నారు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి.

అందులో మొదటగా ప్రధానంగా వినిపిస్తున్న పేరు రష్మిక మందన్నా.నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఉండటం వల్ల కచ్చితంగా పాన్ ఇండియా అప్పీల్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.అందుకే ఈ సినిమా కు ఆమెను తీసుకోవడం జరిగిందనే వార్తలు వస్తున్నాయి.ఇక ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ( Krithi Shetty )ని కూడా ఈ సినిమా లో నటింపజేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

అయితే సినిమా కు సంబంధించిన నటీ నటులు సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను అధికారికంగా మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రకటించారు.కానీ ఇద్దరు హీరోయిన్స్ పేర్ల ను ప్రకటించలేదు.దాంతో గోపీచంద్ మరియు రవితేజ( Gopichand Malineni ) సినిమా లో ఇంతకు హీరోయిన్స్ ఎవరు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే… ఆ ఇద్దరి పేర్లను త్వరలోనే ప్రకటిస్తారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.షూటింగ్ ప్రారంభం అయ్యాక క్లారిటీ వస్తుందేమో చూడాలి.