తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరో రామ్ చరణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.ఎల్లుండి చరణ్ తారక్ తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ థియేటర్లలో రిలీజ్ కానుంది.
చరణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను ఫ్యాన్స్ తో పంచుకున్నారు.తనకు ఇన్ విజిబుల్ సూపర్ పవర్ ఉంటే బాగుంటుందని భావిస్తానని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.
వినయ విధేయ రామ మూవీని ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేదని అనిపించిందని చరణ్ పేర్కొన్నారు.మరిచిపోవడం అనేది తనకు ఎక్కడా ఉపయోగపడని ఒక టాలెంట్ అని చరణ్ చెప్పుకొచ్చారు.
తాజాగా ఫ్యాన్ చేసిన పనితో తాను బాధ పడ్డానని చరణ్ వెల్లడించారు.శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరిగిందని రామ్ చరణ్ అన్నారు.
ఆ సమయం ఒక అభిమాని తనకోసం రోజూ షూటింగ్ స్పాట్ కు వచ్చి తిరుగుతూ ఉండేవారని చరణ్ వెల్లడించారు.

తన సిబ్బంది ఆ విషయాన్ని తనకు తెలియజేశారని చరణ్ పేర్కొన్నారు.అయితే డైరెక్టర్ శంకర్ మేకప్ తో ఉన్న సమయంలో ఫ్యాన్స్ ను కలవద్దని చెప్పడంతో తాను ఆ అభిమానిని కలవలేదని చరణ్ కామెంట్లు చేశారు.ఆ తర్వాత ఆ ఫ్యాన్ హార్ట్ పై టాటూ వేయించుకున్నాడని చరణ్ చెప్పుకొచ్చారు.

ఆ అబ్బాయి తనతో నిన్న టాటూ వేయించానని తనను కలవడం కొరకు టాటూ వేయించానని చెప్పాడని చరణ్ కామెంట్లు చేశారు.ఫ్యాన్ ఆ విధంగా చెప్పడంతో తనకు భయం, బాధ ఒకేసారి కలిగాయని చరణ్ అన్నారు.హీరోహీరోయిన్ల పేర్లను ఫ్యాన్స్ టాటూ వేయించుకోవడంతో ఆశ్చర్యం లేదని అయితే తనను కలవడం కోసమే ఫ్యాన్ టాటూ వేయించుకోవడంతో ఆశ్చర్యపోయానని చరణ్ కామెంట్లు చేశారు.







