నాచురల్ స్టార్ నాని( Hero Nani ) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి అభిమానం సంపాదించుకున్నాడు.
అష్టా చమ్మా సినిమాతో పరిచయమై తొలి నటనకే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
చాలా వరకు మంచి సక్సెస్ లను అందుకున్నాడు నాని.నిజానికి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి అడుగుపెట్టి మొదట్లో టెక్నీషియన్ గా చేసి ఆ తర్వాత హీరోగా అడుగు పెట్టాడు.
ఇక తను ఎంచుకునే కథలు చాలా వరకు ప్రేక్షకులను కనెక్ట్ అవుతాయి.క్లాస్ హీరో గానే కాకుండా మాస్ హీరోగా కూడా నాని అదరగొడతాడు అని చెప్పాలి.
హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు నాని.నిర్మాతగా పలు సినిమాలలో చేయగా నిర్మాత కూడా బాగా కలిసి వచ్చింది.
ఆ మధ్యనే హిట్ 2 సినిమాకు( Hit 2 ) నిర్మాతగా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఇక రీసెంట్ గా దసరా సినిమాతో( Dasara Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం ఆ సినిమా ఓటీటీలో ప్రసారమవుతుంది.ఇక నాని వ్యక్తిగత విషయానికి వస్తే చాలావరకు ఆయన తన పర్సనల్ విషయాలను బయటకి చెప్పుకోవడానికి ఇష్టపడడు.
సోషల్ మీడియాలో కూడా కొంతవరకే యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.
ముఖ్యంగా తన ఫ్యామిలీ గురించి ఎక్కువగా చెప్పినట్లు ఏ రోజు కూడా అనిపించలేదు.
వారిని ప్రేక్షకులకు కూడా అంతగా పరిచయం చేయలేదు నాని.ఇక తను అంజనాను( Anjana ) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆమె ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పంచుకోవడానికి ఇష్టపడడు నాని.ఏదో సందర్భం వచ్చినప్పుడే వారికి సంబంధించిన ఫోటోలు లీక్ అవుతూ ఉంటాయి.

ఇదంతా పక్కన పెడితే తాజాగా నాని వ్యక్తిగతంకు సంబంధించిన ఒక విషయం బాగా వైరల్ అవుతుంది.అదేంటంటే నాని పెళ్లికి ముందు తన భార్యతో బాగా ఎంజాయ్ చేశాడట.పెళ్లి తర్వాత కూడా తన భార్యను భార్యగా చూడకుండా ఇప్పటికీ ప్రేయసి లాగే చూస్తాడట.ఇంట్లో ఉంటే భార్యగా.కారు ఎక్కితే లవర్ గా చూస్తాడట నాని.అప్పుడప్పుడు తన వైఫ్ తో కలిసి రొమాంటిక్ డిన్నర్ డేట్స్ కూడా ప్లాన్ చేస్తుంటాడట.

అలా భార్యను ప్రేమగా చూసుకుంటాడట నాని.అంతేకాకుండా భార్య చెప్పిన మాటకు కూడా చాలా గౌరవం ఇస్తాడని తెలిసింది.తన సినిమాల విషయంలో అంజనా నిర్ణయమే ఫిక్స్ చేస్తాడని తెలిసింది.అయితే గతంలో నాని కొన్ని ఫ్లాప్ లు అందుకున్న సంగతి తెలిసిందే.అయితే అప్పటికే ఆ సినిమాలు చేయొద్దు అని నానికి అంజనా చెప్పినప్పటికీ కూడా నాని వినకుండా ఆ సినిమాలకు కమిట్ అయ్యి నిరాశపడ్డాడని తెలిసింది.ఇక అప్పటినుంచి నాని తన భార్య నిర్ణయమే తీసుకుంటాడని తెలిసింది.
