రీ రిలీజ్ కు సిద్ధమైన నాగార్జున శివ... ప్రత్యేకత ఏమిటంటే?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలను తిరిగి విడుదల చేయడం ఒక ట్రెండ్ గా మారింది.స్టార్ హీరోలు నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.

 Hero Nagarjuna Planning Shiva Movie Re Release Details, Nagarjuna ,siva ,shiva R-TeluguStop.com

ఇప్పటికే ఈ సరికొత్త ట్రెండ్ కి మహేష్ బాబు పోకిరి సినిమాతో తెర లేపగా అనంతరం జల్సా చెన్నకేశవరెడ్డి వంటి సినిమాలు తిరిగి విడుదలవుతూ అద్భుతమైన కలెక్షన్లను రాబట్టాయి.ఇక త్వరలోనే ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాని కూడా విడుదల చేయడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిన చిత్రం శివ.ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇకపోతే ఈ సినిమాను తిరిగి విడుదల చేయనున్నట్లు నాగార్జున ప్రకటించారు.ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ శివ సినిమాని తిరిగి విడుదల చేయాలని భావిస్తున్నాము అయితే ఈ సినిమాని థియేటర్లో కాకుండా డిజిటల్ మీడియాలో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు సమాచారం.

 Hero Nagarjuna Planning Shiva Movie Re Release Details, Nagarjuna ,Siva ,shiva R-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని రీల్స్ మిస్ అయ్యాయని త్వరలోనే ఈ సినిమాని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని నాగార్జున వెల్లడించారు.అయితే ఈ సినిమా 1990 డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా 22 సంవత్సరాల పూర్తి చేసుకోనున్న సందర్భంగా డిసెంబర్ నెలలోనే విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.ఇప్పటివరకు తిరిగి విడుదల చేసిన సినిమాలలో ఎక్కువగా చెన్నకేశవరెడ్డి సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది.

ఇక శివ సినిమా ఎలాంటి ఆదరణ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది.

Video : Hero Nagarjuna Planning Shiva Movie Re Release Details, Nagarjuna ,Siva ,shiva Re-release,tollywood, Nagarjuna Shiva Movie, Shiva Movie Re Relase, Director Ram Gopal Varma, Aadi, Pokiri , Jalsa #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube