ఆ విషయంలో 'చైసామ్'ను క్లారిటీ కోరుతున్న అక్కినేని అభిమానులు!

సమంత అంటే తెలియని వారు ఉండరేమో.తన నటనతో, అభినయంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.

మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను మాయ చేసింది.టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని కోడలు అయ్యింది.టాలీవుడ్ లో చైసామ్ జంటకు మంచి పేరు ఉంది.

ఎంతో అన్యోన్యంగా ఉండే జంటల్లో వీళ్ళు ముందు వరుసలో ఉంటారు.పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.సమంత పెళ్లి తర్వాత తన సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరును సమంత అక్కినేని గా చేంజ్ చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

రెండు సంవత్సరాలుగా అలాగే ఉంటున్న ఈ పేరులో ఈ మధ్యనే అక్కినేని తొలగించి S అనే లెటర్ పెట్టడంతో అప్పటి నుండి సమంత చైతన్య గురించి తీవ్రంగా చర్చలు సాగుతున్నాయి.ఈ విషయంపై గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి.

చైతూ సామ్ మధ్య గొడవలు వచ్చి ఆ విషయం నాగార్జున అమల వరకు కూడా వెళ్లిందని ప్రచారం జరుగుతుంది.సమంత సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన ఈ విషయంపైనే నెటిజెన్స్ ప్రశ్నలు వేస్తున్నారు.

కానీ సమంత ఈ విషయంపై స్పందించడం లేదు.ఈ మధ్యనే స్పందించిన అసలు విషయం మాత్రం చెప్పలేదు.

నేను నాకు నచ్చినప్పుడు మాత్రమే వివాదాలు గురించి మాట్లాడుతానని తెలిపింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవం సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ...డైరెక్టర్ ఎవరంటే..?

దీంతో సమంత చైతన్య మధ్య ఏం జరుగుతుందా అని అందరు తీవ్రంగా చర్చించు కుంటున్నారు.ఎప్పుడు ఎంతో అన్యోన్యంగా కనిపించే చైసామ్ బంధానికి ఏం జరిగిందో అర్ధం కాక అక్కినేని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఈ విషయంపై త్వరగా క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు.

Advertisement

అయితే కొంత మంది మాత్రం శాకుంతలం సినిమా ప్రొమోషన్ కోసం సమంత ఇలా చేస్తుందని చెప్పుకుంటున్నారు.మరి ఈ వార్తలపై వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించే వరకు ఈ చర్చ మాత్రం ఆగదు.

తాజా వార్తలు