Naga Chaitanya : గాయపడిన మనసు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన చైతన్య.. కన్నీళ్లు పెట్టించారుగా?

అక్కినేని హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి నాగచైతన్య ( Naga Chaitanya ) ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.నటుడిగా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి త్వరలోనే చందు మొండేటి ( Chandu Mondeti ) దర్శకత్వంలో రాబోతున్న తండేల్ ( Thandel ) అనే సినిమాలో నటిస్తున్నారు.

 Hero Naga Chaitanya Old Emotional Video Goes Viral-TeluguStop.com

ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుగుతుంది.ఇలా సినిమాల పరంగా చైతన్య ఎంతో బిజీ అయ్యారు.

తాజాగా నాగచైతన్యకు సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో చైతన్య మాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.

ఈ వీడియోలో నాగ చైతన్య మాట్లాడుతూ.గాయపడిన మనసు ఒక మనిషిని ఎంత దూరమైన తీసుకెళ్తుంది.ఎవరికైనా ఆ ఎమోషన్( Emotion ) అర్ధమవుతుంది.అది మన ఫ్రెండ్స్ కైనా లేకుంటే ఫ్యామిలీకైనా ఏదైనా జరిగితే మన లోపల ఉండే బాధ వేరే ఉంటుంది.

అలాంటి సమయంలో మనం స్పందించాము అంటే చాలా జెన్యూన్ గా రియాక్ట్ అవుతాము అంటూ నాగచైతన్య షేర్ చేసినటువంటి ఈ ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాగచైతన్య మాటలు అందరిని హత్తుకునేలా ఉన్నాయని చెప్పాలి.అయితే ఈయన తన మనసులో ఉందని బాధని మొత్తం ఇలా చెప్పారని తెలుస్తుంది.ప్రస్తుతం నాగచైతన్య తన వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే.

ఈయన సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే కొన్ని మనస్పర్ధలు కారణంగా సమంతకు ( Samantha ) విడాకులు ఇచ్చి తన నుంచి దూరం ఉన్నారు.

ఇలా సమంతకు దూరమైనటువంటి ఈయన ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.ఇక సమంత కూడా నాగచైతన్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత కెరియర్ పరంగా సినిమాను వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube