హీరో కృష్ణ మాటలకు తలొగ్గిన స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రెడ్డి.. చివరకు ఏమైందంటే?

సినిమా నిర్మాణంలో ప్రొడ్యూసర్‌దే కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రొడ్యూసర్ కథను నమ్మి డబ్బులు పెడితేనే మూవీ బయటకు వచ్చి, ప్రేక్షకుల మెప్పు పొందుతుంది.

ఇకపోతే చిత్ర పరిశ్రమలో నిర్మాతలను హీరోలతో పాటు ప్రతీ ఒక్కరు గౌరవిస్తుంటారు.అప్పటి నిర్మాత ఎమ్మెస్ రెడ్డిని సైతం నాటి టాప్ హీరోలు శోభన్ బాబు, కృష్ణ అభిమానించేవారు.

ఎమ్మెస్ రెడ్డి కథను ఓకే చేస్తే చాలు అది హిట్ గ్యారంటీ అని అనుకునే వారు.అలా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెస్ రెడ్డి కొద్ది రోజుల తర్వాత జడ్డిమెంట్ విషయమై తడబడ్డాడు.

ఆయన తీసిని సినిమాలు దాదాపు పదిహేను ఏళ్లు ఒక్కటీ ఆడలేదు.వరుస ఫెయిల్యూర్స్‌తో ఆయన బాధపడుతున్నాడు.

Advertisement
Hero Krishna Hurts Producer Ms Reddy , Krishna, Ms Reddy, Kodandramireddy, Palna

చిన్న హీరోలు కూడా ఆయనకు డేట్స్ ఇచ్చే పరిస్థితులు లేవు.ఇక ప్రొడ్యూసర్‌గా ఉండొద్దని, సినిమా నిర్మాణం ఆపేయాలని ఎమ్మెస్ రెడ్డి అనుకున్నారు.

ఆ టైంలో సూపర్ స్టార్ కృష్ణ ఎమ్మెస్ రెడ్డికి కబురు పంపి, డేట్స్ ఇస్తానని చెప్పాడు.అయితే, ఈ సందర్భంలో ఎమ్మెస్ రెడ్డి కృష్ణ మాటలకు తలొగ్గాల్సి వచ్చింది.

ఇంతకీ కృష్ణ ఎమ్మెస్ రెడ్డికి ఏం చెప్పారంటే.

Hero Krishna Hurts Producer Ms Reddy , Krishna, Ms Reddy, Kodandramireddy, Palna

సాధారణంగా ఎమ్మెస్‌రెడ్డి సినిమా నిర్మాణంలో ఎవరి మాట వినబోరు.డైరెక్టర్ ఎవరు? కథ ఏంటి? ఎలా ఉండాలి? అని పలు విషయాల్లో జోక్యం చేసుకుంటారు.ఈ నేపథ్యంలో హీరో కృష్ణ ఎమ్మెస్ రెడ్డి‌తో మాట్లాడుతూ తాను డేట్స్ ఇస్తానని కాని డైరెక్టర్‌గా కోదండరామిరెడ్డినే పెట్టాలని కండిషన్ పెట్టాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఆ మాటలకు ఎమ్మెస్‌రెడ్డి తలొగ్గాల్సి వచ్చింది.కోదండరామిరెడ్డి వద్దకు వెళ్లి పరిస్థితి వివరించి తనకు సినిమా చేయాలయ్యా అని అడిగాడు.ఇక అక్కడ సైతం కోదండరామిరెడ్డి ఓ కండిషన్ పెట్టాడు.

Advertisement

తన సినిమా కథలో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెస్ రెడ్డికి సూచించాడు.అలా ఆ మాటలకు సైతం ఎమ్మెస్ రెడ్డి తలొగ్గాల్సి వచ్చింది.

మొత్తంగా ఎమ్మెస్ రెడ్డి నిర్మాతగా, కృష్ణ హీరోగా వచ్చిన ‘పల్నాటి సింహం’ ఫిల్మ్ సూపర్ హిట్ అయింది.ఈ చిత్ర శతదినోత్సవ వేడుకలో ఎమ్మెస్ రెడ్డి మాట్లాడుతూ తనకు విజయాన్ని అందించిన కృష్ణ, కోదండరామిరెడ్డికి థాంక్స్ చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

ఇరవై ఏళ్లుగా విజయాలు లేక అలసిపోయానని పేర్కొన్నాడు.

తాజా వార్తలు