Chittoor Nagayya Remuneration: ఎన్టీఆర్, ఏఎన్నార్ ను కాదని లక్ష రూపాయల పారితోషికం తీసుకున్న హీరో ఎవరంటే?

సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగానికి చేసిన సేవలు మరవలేనివి.ఈ ఇద్దరు హీరోలు సాధించిన సంచలన రికార్డులను నేటి తరం హీరోలు బ్రేక్ చేయడం సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కృష్ణ మేకప్ మ్యాన్ మాధవరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.1956లో నేను ఇండస్ట్రీకి వచ్చానని ఆయన కామెంట్లు చేశారు.పౌరాణిక చిత్రాలకు మేకప్ అంటే అనుభవం ఉండాలని మాధవరావు తెలిపారు.

 Hero Chittoor Nagayya Remuneration Highest Than Sr Ntr And Anr Details, Chittoor-TeluguStop.com

అప్పుడు రోజుకు 2 రూపాయలు 3 రూపాయల చొప్పున రెమ్యునరేషన్ ఇచ్చేవారని ఆయన పేర్కొన్నారు.

హీరోలకు కూడా 3,000 రూపాయలు అలా రెమ్యునరేషన్ ఉండేదని మాధవరావు పేర్కొన్నారు.ఆరోజుల్లో లక్ష రూపాయలు తీసుకున్న హీరో చిత్తూరు నాగయ్య అని ఆయన వెల్లడించారు.రామారావు, నాగేశ్వరరావు తీసుకున్న రెమ్యునరేషన్ కంటే ఈయన రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండేదని సమాచారం.

సీనియర్ ఎన్టీఆర్ తో పరువు ప్రతిష్ట సినిమాకు నేను పని చేశానని ఆయన తెలిపారు.

Telugu Krishna, Madhava Rao, Nandamuritaraka, Tollywood-Movie

ప్రయోగాల విషయంలో కృష్ణ ముందుండేవారని ఆయన కామెంట్లు చేశారు.ఏ హీరో కూడా మేకప్ మేన్లను రిపీట్ చేయలేదని అయితే కృష్ణగారు మాత్రం నన్ను రిపీట్ చేశారని ఆయన వెల్లడించారు.నాటకాల నుంచి కృష్ణగారితో పరిచయం ఏర్పడిందని మాధవరావు వెల్లడించడం గమనార్హం.

సాక్షి సినిమాకు నేను కృష్ణగారికి, విజయనిర్మల గారికి పని చేశానని ఆయన అన్నారు.

Telugu Krishna, Madhava Rao, Nandamuritaraka, Tollywood-Movie

న్యాచురల్ మేకప్ కు నేను ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నాకు ఎక్కువగా అవకాశాలు వచ్చాయని మాధవరావు వెల్లడించారు.నేను చాలామంది హీరోయిన్లకు కూడా మేకప్ మ్యాన్ గా పని చేశానని ఆయన చెప్పుకొచ్చారు.మాధవరావు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చిత్తూరు నాగయ్య అప్పట్లోనే లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారంటే గ్రేట్ అని మరి కొందరు చెబుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube