ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు! కోలీవుడ్ లో నయా లవ్ స్టొరీ!

బాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్ మధ్య డేటింగ్, లవ్ అనేవి సాధారణంగా కనిపిస్తూ వుంటాయి.

అయితే సౌత్ ఇండస్ట్రీకి వచ్చే సరికి మన హీరోలు చాలా మంది హీరోయిన్స్ లో ప్రేమాయణానికి దూరంగా వుంటారు.

వారికి ప్రేమ కథల వున్నా ఇండస్ట్రీతో సంబంధం లేని వారిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటారు.అయితే సౌత్ లో కూడా అమల, నాగార్జున, సూర్య, జ్యోతిక, రాజశేఖర్, జీవిత తరహాలో కొన్ని ప్రేమ కథలు వున్నాయి.

ఇదిలా వుంటే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో ప్రేమ కథ చిగురించింది.అయితే ఈ ప్రేమ కథ గురించి ఇన్ని రోజులు ఊహాగానాలు వినిపించిన వేలెంటైన్ డే సందర్భంగా వారి ప్రేమపై స్పష్టత వచ్చేసింది.

కోలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ఆర్య.ఆర్య బన్నికి విలన్ గా వరుడు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరయ్యాడు.

Advertisement

అతని తమిళ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి ఇక్కడి ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.ఇక టాలీవుడ్ లో అఖిల్ తెరంగేట్ర మూవీ అఖిల్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ షాయేషా సైగల్ కోలీవుడ్ లో ఆర్యకి జోడీగా గజనిస్తాన్ అనే సినిమాలో నటించింది.

అక్కడ వీరిదరి మధ్య ప్రేమ చిగురించింది.దీంతో ఇద్దరు వారి కుటుంబ సభ్యులని ఒప్పించి పెళ్లికి రెడీ అవుతున్నారు.

మార్చి నెలలో వీరి పెళ్లి హైదరాబాద్ లో జరిగే అవకాశం వుందని తెలుస్తుంది.

రోజుకు ఐదు నిమిషాలు గోడకుర్చీ వేయడం వల్ల ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా?
Advertisement

తాజా వార్తలు