ఐపీఎల్ 2023 ట్రోఫీతో కెప్టెన్ల ఫోటోషూట్.. రోహిత్ శర్మ గైర్హాజరు.. ఫ్యాన్స్ లో ఆందోళన..!

ఐపీఎల్ సీజన్-16( IPL 16 ) నేడు అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం అవ్వనుంది.

తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇక దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ ప్రేక్షకులకు పండుగే పండగ.ఈ ఐపీఎల్ లో మొత్తం పది జట్లు పాల్గొంటాయి.

అన్ని జట్ల కెప్టెన్లు కలిసి ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోషూట్ కు ఫోజులిచ్చారు.కానీ ఈ ఫోటోషూట్ కు రోహిత్ శర్మ( Rohit Sharma ) హాజరు కాలేదు.

మిగిలిన 9 కెప్టెన్లు కలిసి ఫోటోషూట్ లో పాల్గొన్నారు.ఫోటో షూట్ లో రోహిత్ శర్మ కనిపించకపోవడం తో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

Advertisement

అభిమానులు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు.

రోహిత్ శర్మ కాస్త అనారోగ్యం కారణంగా ఫోటోషూట్ కు రాలేదని, ఏప్రిల్ 2 న ముంబై ఇండియన్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ కు హాజరు అవుతాడని సమాచారం.ఈ ఐపీఎల్ లో రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్లకు హాజరు కాడని తెలుస్తుంది.ఎందుకంటే WTC ఫైనల్ మ్యాచ్ కోసం ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్లకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం ముంబై ఇండియన్స్( Mumbai Indians ) కష్టాల్లో ఉందని చెప్పాలి.ఒకపక్క ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను శస్త్ర చికిత్స కారణంగా ఈ సీజన్లో ఆటకు దూరమయ్యాడు.మరొకపక్క రోహిత్ శర్మ కూడా కొన్ని మ్యాచ్లకు విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఇక ముంబై జట్టు బౌలర్లైన జోఫ్రా ఆర్చర్, జాసన్ బెహ్రెన్ డార్ఫ్ లపై బాధ్యత మరింత పెరిగింది.ఐడెన్ మార్క్రామ్ అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ జట్టుకు భారత పెసర్ భువనేశ్వర్ కుమార్ నాయకత్వం వహించనున్నాడు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

అయితే కేవలం ఆరంభ మ్యాచ్లకు మాత్రమే ఆడడని తెలుస్తుంది.తర్వాత మ్యాచ్లకు హైదరాబాద్ జట్టుకు మార్క్రామ్ నాయకత్వం వహిస్తాడు.

Advertisement

తాజా వార్తలు