వింట‌ర్‌లో పిల్ల‌ల డైట్‌లో ఖ‌చ్చితంగా ఉండాల్సిన 5 ఆహారాలు ఇవే!

వింట‌ర్ సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు వివిధ ర‌కాల వైర‌స్‌లు, ఇన్ఫెక్ష‌న్లు చుట్టు ముట్టేసి ముప్ప తిప్ప‌లు పెడుతుంటాయి.

అందులోనూ పిల్ల‌లు చ‌లి కాలంలో త‌ర‌చూ అనారోగ్యానికి గ‌ర‌వుతుంటారు.

దానికి కార‌ణం వారి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా ఉండ‌ట‌మే.అందు వ‌ల్ల‌నే వింట‌ర్ సీజ‌న్‌లో పిల్ల‌ల డైట్‌లో ఖ‌చ్చితంగా ఐదు ఆహారాల‌ను చేర్చాల్సి ఉంటుంది.

మ‌రి ఆ ఆహారాలు ఏంటీ.? వాటి వ‌ల్ల పిల్ల‌ల‌కు క‌లిగే  ఉప‌యోగాలు ఏంటీ.? వంటి విష‌యాలు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ఖర్జూరం.చ‌లి కాలంలో పిల్ల‌ల‌కు త‌ప్ప‌ని స‌రిగా ఇవ్వాల్సిన ఫుడ్స్‌లో ఇది ఒక‌టి.ఖ‌ర్జూరం పిల్ల‌ల్లో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి సీజ‌న‌ల్ వ్యాధులు ద‌రి చేర‌కుండా ర‌క్షిస్తుంది.

Advertisement

అలాగే పిల్ల‌ల్లో ర‌క్త హీన‌తను నివారిస్తుంది.ఎదుగుద‌ల‌ను రెట్టింపు చేస్తుంది.

మ‌రియు వారిలో నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌కుండా అడ్డు క‌ట్ట వేస్తుంది.చిలగడదుంప‌ల‌ను వారంలో రెండు సార్లు అయినా పిల్ల‌ల‌కు పెట్టాలి.

వింట‌ర్ సీజ‌న్‌లో పిల్ల‌లు చ‌లికి తెగ వ‌ణికి పోతుంటారు.అయితే చిల‌గ‌డ‌దుంప‌ల‌ను ఉడికించి ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో చ‌లిని త‌ట్టుకునే సామ‌ర్థ్యం పెరుగుతుంది.

మ‌రియు ఎన్నో పోష‌క విలువ‌లు సైతం పిల్ల‌ల‌కు ల‌భిస్తాయి.చ‌లి కాలం వ‌చ్చిందంటే చాలు చాలా మంది పిల్ల‌ల్లో జీర్ణ సంబంధిత స‌మ‌స‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

వాటిని నివారించ‌డం క్యారెట్లు సూప‌ర్‌గా హెల్ప్ చేస్తాయి.క్యారెట్ల‌ను పిల్ల‌ల‌కు పెడితే జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతంది.

Advertisement

కంటి ఆరోగ్యం పెరుగుతుంది.ఎర్ర ర‌క్త క‌ణాలు కూడా వృద్ధి చెందుతాయి.

పిల్ల‌ల‌కు వింట‌ర్‌లో ప్ర‌తి రోజు వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో ఇవ్వాలి.వెల్లుల్లిలో ఉండే శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ పిల్ల‌ల్లో జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం వంటి సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా ర‌క్షిస్తుంది.

వింట‌ర్ సీజ‌న్‌లో పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించాలంటే పచ్చి కూరగాయ ముక్క‌లు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.పైగా కూర‌గాయ ముక్క‌ల‌ను ప‌చ్చిగా ఇస్తే పోష‌కాలు సైతం పిల్ల‌లకు ఎక్కు వ ల‌భిస్తాయి.ఫ‌లితంగా వారి ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.

కాబ‌ట్టి, వారంలో క‌నీసం మూడు సార్లు అయినా పిల్ల‌ల‌కు ప‌చ్చికూర‌గాయ ముక్క‌ల‌ను పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించాలి.

తాజా వార్తలు