మేడిగడ్డ బ్యారేజ్ వద్ద భారీ శబ్దాలు, ప్రకంపనలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్( Medigadda Barrage ) వద్ద మళ్లీ భారీ శబ్దాలు, ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది.

ఏడవ బ్లాక్ లోని 16వ గేటున ఎత్తుతుండగా ప్రకంపనలు వచ్చాయి.

బ్యారేజ్ కింద భారీగా గొయ్యి ఏర్పడినట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.దీంతో బ్యారేజ్ గేట్లను ఎత్తే పనులను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఈ క్రమంలో జియో ఫిజికల్, టెక్నికల్ టెస్టుల తరువాతే మరమ్మత్తులు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇప్పటికే నీటి పారుదల అధికారులు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సిబ్బందితో కలిసి ఏడవ బ్లాకులోని 15వ గేటును ఎత్తారు.16వ గేటును కూడా ఎత్తడానికి ప్రయత్నించగా.భారీగా శబ్దాలు, ప్రకంపనలు రావడంతో అధికారులు టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది.

కాగా మేడిగడ్డను ఇటీవలే సెంట్రల్ వాటర్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల కమిటీ సందర్శించిన సంగతి తెలిసిందే.

Advertisement
How Modern Technology Shapes The IGaming Experience

తాజా వార్తలు