ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.మద్యం కుంభకోణంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సిసోడియా రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈడీకి నోటీసులు జారీ చేసింది.అనంతరం సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.
అయితే ఈనెల 9న మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా… పదకొండు రోజులుగా ఆయన ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.