ఎమ్మెల్సీ కవిత పిటిషన్‎పై సుప్రీంకోర్టులో విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

కేసు పెండింగ్ లో ఉండగా నోటీసులు ఇవ్వడంపై కవిత పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.కాగా గతంలోనూ కవిత సుప్రీం ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించకూడదని పిటిషన్ లో పేర్కొన్నారు.అయితే కవిత తరపున న్యాయవాది విక్రమ్ వాదనలు వినిపించనున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ వేసుకుంటే 2 నెలల్లో మీ జుట్టు రెండింతలు అవుతుంది!

తాజా వార్తలు