Chandrababu Naidu : చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంలో విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

అయితే ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ( AP High Court )బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ( AP CID ) చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టగా.దర్యాప్తు అధికారులను చంద్రబాబు కుటుంబం బెదిరిస్తోందని సీఐడీ తరపు న్యాయవాది రోహత్గి కోర్టుకు తెలిపారు.

ఈ క్రమంలో రోహత్గి వాదనలపై చంద్రబాబు తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు.ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Advertisement
మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు